చిరంజీవి - మహేష్‌బాబు కాంబోలో మిస్సయిన సినిమాలు
మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకుడిగా చెలామణి అవుతున్నారు. 69వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నప్పటికీ యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న విశ్వంభర సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. త్రిష కథానాయికగా నటించింది. ప్రస్తుత తరంలోని యువ హీరోలంతా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చిరంజీవికి ముందు తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి హీరోలంతా మల్టీస్టారర్ చేశారు.
చిరంజీవి తరంలో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటివారు అగ్ర కథానాయకులుగా ఉన్నప్పటికీ మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, వెంకటేష్ లాంటివారంతా మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నారు. చిరంజీవి-పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి ప్రయత్నాలు చేశారు. అయితే జనసేన పార్టీ ఆవిర్భావంతో పవన్ రాజకీయాల్లో బిజీగా మారడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. పవన్ కల్యాణ్ బదులుగా మహేష్ బాబు - చిరంజీవి కాంబినేషన్ లో సినిమా తీయాలని ఆయన భావించారు.

కథ కూడా ఇద్దరు హీరోలకు బాగా నచ్చింది. అయితే ఎందుకో త్రివిక్రమ్ కు కథ ఒక పట్టాన నచ్చలేదు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన స్క్రిప్ట్ ను తయారుచేయలేకపోయారు. ప్రస్తుతానికి వద్దు.. భవిష్యత్తులో చేద్దామని నిర్ణయించుకొని ఈ ప్రాజెక్టుకు టాటా చెప్పేశారు. తర్వాత ఆచార్యలో చిరంజీవితోపాటు రామ్ చరణ్ కు బదులుగా మహేష్ బాబును అనుకున్నారు.
రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. దర్శకుడు కొరటాల శివ రామ్ చరణ్ తో వీలు కాదనుకొని నేరుగా మహేష్ బాబును అడిగాడు. ఆయన ఒప్పుకున్నాడు. అయితే చిరు పట్టుబట్టి రామ్ చరణ్ ను నటింపచేశారు. దీనికోసం రాజమౌళిని బాగా బతిమలాడుకోవాల్సి వచ్చింది. మహేష్ బాబు అయితే బడ్జెట్ భారీగా పెరిగిపోతోందని భావించడంతో రెండోసారి కూడా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అలా రెండుసార్లు చిరు, మహేష్ బాబు కాంబోలో సినిమాలు మిస్సవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు.












Click it and Unblock the Notifications