చిరంజీవి దర్శకత్వం వహించిన ఏకైక సినిమా... ఇండస్ట్రీ హిట్

మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. మూడు దశాబ్దాలపాటు అగ్ర కథానాయకుడిగా కొనసాగి.. ప్రస్తుతం కూడా సినిమాలు చేస్తూ యువ కథానాయకులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా తన 154వ సినిమా విశ్వంభర ఏప్రిల్ లో విడుదల కాబోతోంది. దీనికి దర్శకుడు మల్లిడి వశిష్ట. సంక్రాంతికే విడుదల చేద్దామనుకున్నప్పటికీ రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ కు పోటీ కాకూడదనే ఉద్దేశంతో విడుదలను ఏప్రిల్ కు వాయిదా వేసుకున్నారు. 2025 సంవత్సరంలో కూడా తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయస్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ చేశారు. విశ్వంభర తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒకటి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

ఈ విషయాన్ని గోపాల్ స్వయంగా చెప్పారు
చిరంజీవి తన కెరీర్ లో 154 సినిమాలు చేసినప్పటికీ ఎప్పుడూ దర్శకత్వం వహించిన దాఖలాలు లేవు. అయితే ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఒకటి ఉంది. అంతేకాదు.. అది ఇండస్ట్రీ హిట్ కొట్టి రికార్డులను తిరగరాసింది. ఆ సినిమా ఏదంటే.. ఇంద్ర. అవును వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించి సంగతి తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో బి.గోపాల్ మాట్లాడుతూ ఇంద్ర సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోపాటు మరికొన్ని సన్నివేశాలకు చిరంజీవి దర్శకత్వం వహించారని చెప్పారు. అంతేకాదు.. కొన్ని సన్నివేశాలను ఆయన స్వయంగా రాసుకున్నారని గోపాలే చెప్పారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

mega star chiranjeevi directed only one film

థియేటర్లలో రెండు కోట్లమంది చూశారు
ఈ సినిమాను మొత్తంమీద థియేటర్లలో రెండు కోట్ల మంది వీక్షించారు. అప్పటివరకు ఏ తెలుగు సినిమాకు లేనంతగా రూ.30 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంద్ర సినిమాకు ముందు చాలా సినిమాలు ఫ్లాప్ అవడంతో ఏ సినిమా చేయాలా? అన్న మీమాంసలో చిరంజీవి ఉన్నారు. చివరకు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగినట్లుగా చిన్నికృష్ణ కథను తయారు చేయడం, చిరంజీవి కూడా కొన్ని సన్నివేశాలను స్వయంగా రాసుకోవడం జరిగింది. చివరకు ఇండస్ట్రీ హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ ఎక్కారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఆయనకు సరైన విజయాలు దక్కడంలేదు. దీంతో చిరంజీవి యువ దర్శకులనే నమ్ముకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+