చిరంజీవి కొత్త ఇంటిని చూశారా?... ఫలక్‌నుమా ప్యాలెస్ కూడా సరిపోదు!
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు గురించి దేశవ్యాప్తంగా పరిచయం అవసరంలేదు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. అందులో మూడు దశాబ్దాలు అగ్ర కథానాయకుడిగా రాణించారు. ప్రస్తుతం యువ హీరోలా హవా నడుస్తున్నప్పటికీ తన స్టామినా మాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూ.150 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటోన్న విశ్వంభర చేస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తోంది. దీనితర్వాత చేయబోయే చిత్రానికి సంబంధించి కథలు వింటున్నారు. కథను బట్టి దర్శకుడు ఖరారు అవుతారు.
రూ.100 కోట్లతో నూతన ఇల్లు
నాలుగు దశాబ్దాల నుంచి పరిశ్రమలో కొనసాగుతున్న చిరంజీవి ఆస్తులు మంచిగానే ఉన్నాయి. ఉన్న డబ్బును జాగ్రత్త చేసుకోవడంతోపాటు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు. ఇతర దేశాల్లోని హోటల్స్ రంగంలో కూడా తన సొమ్మును పెట్టుబడిగా పెట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రూ.100 కోట్లతో అధునాతన సౌకర్యాలతో ఇంటిని నిర్మించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంకు సమీపంలో ఉంటుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిల్‌యాని దీన్ని డిజైన్ చేశారు. 25వేల చదరపు అడుగుల స్థలంలో ఇది నిర్మితమైంది.

రెండో అంతస్తులో స్విమ్మింగ్ పూల్
ఉదయం సమయంలో సూర్యుడి అందాలు ఆస్వాదించేలా రెండో అంతస్తులో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. కింద అంతస్తులో దేవుడి గది ఉంటుంది. దీన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు. దేవుడి ఫొటోలతోపాటు తన తండ్రి ఫొటో, మామ అల్లు రామలింగయ్య ఫొటోలు కూడా ఉంటాయి. ఇటీవలే వాస్తు సలహాలకు అనుగుణంగా కొన్నింటికి మార్పుచేర్పులు చేశారు. హైదరాబాద్ లోనే కాకుండా బెంగళూరులో కూడా మరో అందమైన ఇంటిని చిరంజీవి నిర్మించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి అప్పుడప్పుడూ వెళ్లివస్తుంటారు.












Click it and Unblock the Notifications