రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్
నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. 41వ పుట్టినరోజును మెగాస్టార్ కుటుంబం ఘనంగా జరుపుకొంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిమంది అభిమానులు రామ్ చరణ్ కు విషెస్ తెలియజేస్తోన్నారు. అదే సమయంలో పెద్ది టైటిల్ గ్లింప్సెస్ కూడా వెలువడటంతో వారి ఆనందానికి హద్దులేకుండా పోయింది. కండలు తిరిగిన శరీరంతో కుస్తీ వీరుడిగా ఈ గ్లింప్లెస్ లో కనిపించాడు రామ్ చరణ్. దీంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయింది.
రామ్ చరణ్ బర్త్ డే కావడంతో మెగా కాంపౌండ్ లో జోరుగా సెలబ్రేషన్స్ సాగాయి. చిరంజీవి ఇంటిల్లిపాదీ ఆయనకు విషెస్ తెలిపింది. కజిన్ అల్లు అర్జున్ చేసిన సరదా ట్వీట్.. ఆకట్టుకుంది. చిరంజీవి తన తనయుడికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాల్యం నుండి నేటి స్టార్‌డమ్ వరకు చరణ్ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ అపురూప త్రోబ్యాక్ చిత్రాలను షేర్ చేశారు.

చరణ్ బాబు, చిన్నతనంలో నా చేయి పట్టుకొని నడిచిన దగ్గర నుండి నేడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడటం వరకు గర్వకారణమని చిరంజీవి పేర్కొన్నారు. సినిమా, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేసుకునే విధానం, కుటుంబం పట్ల బాధ్యత, దైవ భక్తి, క్రమశిక్షణ, విలువలు.. ప్రేమాభిమానాలు మరింత బలపడేలా చేశాయని అన్నారు.. దేవుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమ ఎల్లప్పుడూ ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని చెప్పారు.
రామ్ చరణ్ సోదరి, నిర్మాత సుస్మిత కొణిదెల ఆయన్ను కుటుంబానికి వెన్నెముకగా అభివర్ణించారు. రామ్ చరణ్ తమ కుటుంబ బలం అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తన కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్, తన రాబోయే ప్రాజెక్ట్‌ను ప్రస్తావిస్తూ చరణ్‌కు సరదాగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఏడాది 'పెద్ది' నామ సంవత్సరంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నానని అన్నాడు.
రామ్ చరణ్ పుట్టినరోజును చిరంజీవి ఎంతో అర్థవంతంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛంద సంస్థలను సందర్శించారు. ఎన్టీఆర్ అవార్డు ద్వారా వచ్చిన 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీని విరాళంగా అందించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వయోధిక వృద్ధులతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకొన్నారు. వారితో కలిసి భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం వారికి స్వయంగా ఆహారం వడ్డించారు. దుస్తులు పంపిణీ చేశారు. తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరో అని నిరూపించుకున్నారు మెగాస్టార్.
-
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే!












Click it and Unblock the Notifications