చిరంజీవికి సర్జరీ..! వైరల్ అవుతున్న మెగాస్టార్ పోస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి భారీగా ఆదరణ లభించింది. థియేటర్లలో ఫుల్ రన్ లో దాదాపు రూ. 400 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా ఈ మూవీ నిలిచింది. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ సాధించింది.
అయితే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన భుజానికి సర్జరీ జరిగిందనే వార్త అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. చిరంజీవి షోల్డర్ కు సర్జరీ జరిగిందని సమాచారం అందుతోంది. గత రెండు మూడు రోజులుగా ఎడమ చేతికి షోల్డర్ బ్యాగ్ వేసుకొని చిరంజీవి కనిపిస్తున్నారు. చిరంజీవి షోల్డర్ బ్యాగ్ తో ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మెగాస్టార్ కు ఏమైంది అని నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.
అయితే తాజాగా చిరంజీవి స్వయంగా తన సర్జరీ గురించి తెలుపుతూ పోస్టు పెట్టారు. ఈ మేరకు తనకు సర్జరీ చేసిన వైద్యుడితో కలిసి దిగిన ఫోటోను తన సామాజిక మాధ్యమంలో షేర్ చేసారు. చేతికి బ్యాగ్ గమనించిన తర్వాత చాలా మంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం షోల్డర్ కీహోల్ సర్జరీ. నేను బాగా కోలుకుంటున్నాను. ఇప్పటికే నా రెగ్యులర్ వర్క్స్ మొదలు పెట్టాను.
ఈ మేరకు బెస్ట్ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన నైపుణ్యంతో ఈ సర్జరీను విజయవంతంగా చేశారు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు అని చిరంజీవి తెలిపారు. దీంతో చిరంజీవి పోస్ట్ కింద జాగ్రత్త అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ప్రస్తుతం చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. దాంతో ఏడు పదుల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీగా దూసుకెళ్తున్నారు చిరంజీవి.












Click it and Unblock the Notifications