రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ వల్లే కాలేదు..ఈ యంగ్ కొట్టి చూపించాడు..!
యంగ్ హీరో తేజ సజ్జ నటించిన తాజా చిత్రం 'మిరాయ్' బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. 'హనుమాన్' సినిమాతో పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన తేజ, 'మిరాయ్'తో తన స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు. విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 55 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే, ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం ఈ చిత్రం రూ. 53 కోట్లు వసూలు చేసినట్లు అంచనా.
ఈ సినిమా కలెక్షన్ల దూకుడు చూస్తే ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజున వసూళ్లు మరింత పెరిగాయి. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం, రెండో రోజున రూ. 8.20 కోట్ల షేర్ వసూలైంది. ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' లాంటి చిత్రాలకు కూడా ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని చెప్పడం 'మిరాయ్' ప్రభావాన్ని తెలియజేస్తుంది.

మూడో రోజున కూడా ఈ చిత్రం మంచి ఆక్యుపెన్సీతో నడుస్తోందని, రెండో రోజు కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. హిందీలో కూడా రెండో రోజున రూ. 3.50 కోట్ల నెట్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లోనూ రెండో రోజున హాఫ్ మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది.
మొత్తంగా, మొదటి రెండు రోజుల్లో దాదాపు రూ. 55 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, మూడు రోజుల్లో రూ. 85 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కును దాటి లాభాల బాట పట్టిందని సమాచారం. 'హనుమాన్' చిత్రం రూ. 400 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన నేపథ్యంలో, 'మిరాయ్' కనీసం రూ. 200 కోట్ల గ్రాస్‌ను సాధిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తేజ సజ్జ కెరీర్‌లో ఈ సినిమా మరో మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications