'నీ భర్తతో తప్పు చేసినందుకు క్షమించు' హీరోయిన్‌కు సారీ చెప్పిన బ్యూటీ
బాలీవుడ్‌లో ఇప్పటికిప్పుడు స్టార్ హీరోయిన్ ఎవరంటే అందరు ఠక్కన చెప్పే పేరు కియారా అద్వానీ. వరుస సినిమాల్లో నటిస్తూ అక్కడ స్టార్ హీరోయిన్‌గా కియారా అద్వానీ మారిపోయింది. ఇదే సమయంలో తెలుగులో కూడా మహేష్ బాబు, రామ్ చరణ్ హీరోల వంటి సినిమాల్లో నటించి సౌత్‌లో కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. మహేష్ బాబుతో భరత్ అనే నేను, రామ్ చరణ్‌తోవినయ విధేయ రామ సినిమాల్లో నటించింది.
ప్రస్తుతం రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాను కియారా గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా తల్లి కాబోతుందనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ రుమార్స్‌ను కియారా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. దీంతో ఇదింతా అసత్య ప్రచారమే అని చెబుతున్నారు.

దీనిపై కియారా అద్వానీ దంపతులు ఇప్పటి వరకూ స్పందించకపోవడంతో ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా కియారా అద్వానీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఓ బ్యూటీ కియారా అద్వానీ భర్త సిద్దార్ధ్ మల్హోత్రాతో తాను రొమాన్స్ చేశానని ప్రకటించి సంచలనం సృష్టించింది. ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న సిద్దార్ధ్ మల్హోత్రాను ఓ మోడల్ ఫ్లర్టింగ్ చేసే ప్రయత్నం చేసింది. ఒకనొక సమయంలో సిద్దార్ధ్ మల్హోత్రా సైతం ఆమె తీరుతో ఇబ్బందికి గురయ్యారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ మోడల్ ఈ ఘటనపై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఆమె కియారకు పబ్లిక్‌గా క్షమాపణలు కోరింది చెప్పింది. 'నీ భర్తతో అలా చేసినందుకు క్షమించు' అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు ఆ మోడల్‌పై ప్రశంసలు కురిపించారు. చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం మంచి వ్యక్తిత్వం కలిగిన వారి లక్షణమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications