అల్లు అర్జున్ ను ఆహ్వానించని టాలీవుడ్.. మెగాహీరోనే కారణమా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అరుదైన గుర్తింపును తీసుకొచ్చారు. పరిశ్రమ ప్రారంభమైన తర్వాత ఏ హీరోకు దక్కని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడిగా తొలిసారి తెలుగు నుంచి ఎంపికయ్యారు. దీనిపై అన్ని చిత్ర పరిశ్రమలు హర్షం వ్యక్తం చేశాయికానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాత్రం మౌనం వహించింది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తో అందరూ సరిపెట్టారు. ఇదిలావుంటే మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ వేడుక జరిగింది. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవగా అందరూ ఆయన్ని సత్కరించారు. అల్లు అరవింద్, మురళీమోహన్ లాంటి నిర్మాతలు, ప్రముఖ దర్శకులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ కనీసం ఇప్పుడైన చిరంజీవిని పిలిపించి అభినందిస్తున్నారు.. సంతోషం అన్నారు.

muralimohan comment on allu arjun

అలాగే అల్లు అర్జున్ కు అవార్డు వచ్చినప్పుడు పరిశ్రమలోని పెద్దలు ఎందుకు స్పందించలేని ప్రశ్నించారు. కనీసం పిలిపించి వేడుకచేసి సన్మానించలేదని, తామంతా చెన్నైలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఇప్పుడైనా కనీసం చిరంజీవిని సన్మానిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ చురకలు వేశారు.

అల్లు అర్జున్ కు ఎటువంటి సన్మానం జరపకపోవడం వెనక మెగా కుటుంబం ఉందంటూ బన్నీ అభిమానులు మండిపడుతున్నారు. పరిశ్రమలో చిరంజీవి మాట చెల్లుబాటవుతుందని, బన్నీని సన్మానించి ఆయనతో వ్యతిరేకత కావడం ఎందుకులే అన్న ఉద్దేశంతో పరిశ్రమ పెద్దలంతా మౌనంగా ఉండిపోయారనే అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇదే వేడుకకు అల్లు అర్జున్ ను కూడా పిలిపించి సత్కరిస్తే ఎంతో బాగుండేదని, అటువంటి మంచి పని చేయడానికి సినీ పెద్దలెవరికీ మనసు రాలేదంటున్నారు.

ఇటీవలి కాలం నుంచి మెగా కుటుంబంతో అల్లు అర్జున్ కు సంబంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి. గతంలో ఉన్నంత సన్నిహిత సంబంధాలు లేవనే విషయం బహిరంగ రహస్యమే. మెగా అనే ముద్ర కాకుండా తనంతట తాను సొంతంగా ఎదగాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ ఉన్నారు. ఈ తరహా ఆలోచనా ధోరణితోపాటు మరికొన్ని సంఘటనలు అల్లు కుటుంబానికి, మెగా కుటుంబానికి దూరం పెరగడానికి కారణమయ్యాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+