మిస్టరీ గర్ల్‌తో నాగ చైతన్య ప్రత్యక్షం
అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. నాగ చైతన్య- శోభిత కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్‌లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరు అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చారు.
ఈక్రమంలోనే నాగ చైతన్య , శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ ..నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్ణమని తెలిపింది.పెళ్లి తర్వాత నూతన జంట పలు టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.

వీరిద్దరు తమ సినిమా షూటింగ్‌లకు కొంత గ్యాప్ ఇచ్చిన హానీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు. తాజాగా వీరిద్దరు కలిసి వెకేషన్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే శోభిత,నాగ చైతన్యలతో పాటు మరో అమ్మాయి కూడా వీరితో కనిపించింది. ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం తెలియడం లేదు. హానీమూన్‌కు ఫ్యామిలీ మెంబర్‌ను తీసుకువెళ్లరు కదా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఎదురవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక నాగ చైతన్య కెరీర్ విషయానికి వస్తే.. తండేల్ సినిమాతో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమా తర్వాత విరూపాక్ష సినిమాకు దర్శకత్వం వహించినది కార్తీక్ వర్మ దండుతో ఓ సినిమా చేయడానికి నాగ చైతన్య గ్రీన్ సీగ్నల్ ఇచ్చాడు.ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది శోభితా ధూళిపాళ. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.












Click it and Unblock the Notifications