నాగ చైతన్య, శోభిత ధూళిపాళ కాపురంలో చిచ్చు పెట్టిన సాయి పల్లవి
హీరో నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ ప్రేమాయణం గురించి తెలిసిన విషయమే. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభిత ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశారు. నాగ చైతన్య , శోభిత ధూళిపాళ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య , శోభిత ధూళిపాళ గతేడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నారు.
పెళ్లి విషయంలో శోభిత ధూళిపాళ చాలా ప్లాన్డ్‌గా ముందుకు వెళ్లినట్టు కనిపించింది. ఎటువంటి హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా సైలెంట్‌గా వివాహం చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత తమ సినిమాల్లో బిజీగా మారిపోయారు ఈ జంట. వీరిద్దరు తమ సినిమా షూటింగ్‌లకు కొంత గ్యాప్ ఇచ్చి మరీ హానీమూన్‌ను ఎంజాయ్ చేశారు.

ప్రస్తుతం వీరిద్దరు తమ సినిమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా నాగ చైతన్య జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తూన్న 'జయమ్ము నిశ్చయమ్మురా' షోకు గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభిత ధూళిపాళతో ప్రేమ గురించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు నాగ చైతన్య. తానే మొదట శోభితకు ప్రపోజ్ చేసినట్టు నాగ చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా భార్యతో జరిగిన చిన్న ఫన్నీ ఇన్సిడెంట్‌ను నాగ చైతన్య షేర్ చేసుకున్నారు.
పెళ్లి తర్వాత నాగ చైతన్య నటించిన సినిమా తండేల్. ఈ సినిమాతో నాగ చైతన్య తొలిసారి ఆయన 100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమా విడుదల సమయంలో శోభితకు నాగ చైతన్యకు మధ్య చిన్న గొడవ జరిగిందట. తండేల్ సినిమాలోని బుజ్జితల్లి పాట గురించి వీరిద్దరి విభేదాలు వచ్చినట్టు నాగ చైతన్య తెలిపారు. ఈ పాట కారణంగా తన భార్చ శోభిత కొన్నాళ్లపాటు మాట కూడా మాట్లాడలేదట.
శోభితను నేను ముద్దుగా బుజ్జితల్లి అని పిలుస్తానని.. అయితే ఈ పేరునే తండేల్‌లో చిత్రంలో సాయి పల్లవికి పెట్టడం.. బుజ్జితల్లిపై పాట కూడా రావడంతో శోభిత బాధపడిందని చైతు చెప్పుకొచ్చాడు.ఆ కోపంతో శోభిత కొన్నాళ్లు నాతో మాట్లాడలేదు. ఆ పేరుని నేనే దర్శకుడికి సూచించానని ఆమె అనుకుంది. కానీ నేనెందుకు అలా చేస్తా? అని నవ్వుతూ చెప్పాడు నాగ చైతన్య. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications