ప్రశాంత్ వర్మను లాగిపెట్టి రెండిచ్చిన బాలయ్య?

నందమూరి నటసింహం బాలకృష్ణ తన వారసుడిగా తనయుడు మోక్షజ్ఞను పరిశ్రమకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది దర్శకులు ముందుకు వచ్చినప్పటికీ చివరకు ప్రశాంత్ వర్మకు అవకాశం దక్కింది. ఇతిహాసాలకు, పురాణాలకు ముడిపెట్టి తయారుచేసిన కథ బాలయ్యకు బాగా నచ్చింది. దీంతో ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమా ఖాయమైంది. ఈనెల ఐదోతేదీన ముహూర్తం కుదిరి షూటింగ్ ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. దీనికి కారణం ప్రశాంత్ వర్మ అని తెలుస్తోంది. హనుమాన్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మకు తలపొగరు బాగా ఎక్కువైందని, పూర్తి కమర్షియల్ గా మారిపోయాడని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.

డబ్బులు భారీగా డిమాండ్ చేస్తున్న ప్రశాంత్ వర్మ
అన్ స్టాపబుల్ షో ట్రైలర్ ను కట్ చేయమని ఆహా టీం అడిగితే డబ్బులు భారీగా డిమాండ్ చేయడంతో అతన్ని కాదనుకున్నారు. చివరకు మోక్షజ్ఞతో సినిమా విషయంలో బాలయ్యకు చావుకబురు చల్లగా చెప్పాడు. కథను తాను అందిస్తాను.. దర్శకత్వం మాత్రం తన అసిస్టెంట్ మాత్రం చేస్తాడని చెప్పడంతో బాలయ్యకు ఒళ్లు మండి వర్మకు రెండిచ్చాడని తెలుస్తోంది. ఆ కథ మోక్షజ్ఞను దృష్టిలో ఉంచుకొనే నాలుగు నెలలపాటు ప్రశాంత్ వర్మ తయారు చేశాడు. వేరే హీరోతో చేయడం కూడా కుదరదు. అలాగే అందులో బాలయ్య కూడా నటిస్తాడు. ఆయన కోసం పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ కథను మోక్షజ్ఞ, బాలయ్యతోనే తీయాలి. వేరే హీరోతో తీయడానికి వీలుపడదు.

nandamuri balakrishna expresses anger over Prashanth Varma s attitude regarding the movie Mokshagna

పాలుపోని స్థితిలో ప్రశాంత్ వర్మ
దీంతో ఎటూ పాలుపోని పరిస్థితిలో ప్రశాంత్ వర్మ పడిపోయాడు. జై హనుమాన్ సినిమాను రిషభ్ శెట్టితో చేయాల్సి ఉంది. దీనికి చాలా సమయం ఉంది. అలాగే రణవీర్ సింగ్ తో చేయాల్సిన ప్రాజెక్టర్ రద్దయింది. మోక్షజ్ఞతో సినిమా చేస్తాడా? లేదంటే బాలయ్య వేరే డైరెక్టర్ ను రంగంలోకి దింపుతాడా? అనేది స్పష్టత రాలేదు. కొందరు సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఉండదంటున్నారు. ఒకవేళ మోక్షజ్ఞతో కుదరకపోతే నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ తో సినిమా తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే మోక్షజ్ఞ తొలి సినిమా ఒకవేళ వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఉండే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+