చిరంజీవి నటించిన ఆ సినిమా అంటే బాలయ్యకు మహా ఇష్టం
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. వీరిద్దరి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర తలపడితే మెగాస్టార్ అభిమానులు, నందమూరి అభిమానుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని చెప్పొచ్చు. కొన్ని సంవత్సరాలుగా ఈ ఇద్దరు అభిమానుల మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది. మరోసారి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ అగ్రహీరోలిద్దరూ పోటీకి దిగుతున్నారు. వాస్తవ జీవితంలో మాత్రం ఇద్దరూ సఖ్యతగానే ఉంటారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో కలుసుకున్నారు
ఇటీవల కాలంలో మాత్రం చిరంజీవి, బాలకృష్ణ కలవడం కుదర్లేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ సమయంలో వేదికపైనే ఉన్న ఇద్దరూ పలకరించుకున్నారు. కెరీర్ పరంగా వీరిద్దరూ హోరాహోరీగా పోటీపడేవారు. ఒక హీరో చేసిన సినిమాలు మరో హీరోకు నచ్చడం సాధారణంగా జరుగుతుండే విషయమే. అలా చిరంజీవి చేసిన సినిమాల్లో బాలకృష్ణకు బాగా నచ్చిన సినిమా ఒకటుంది. మొదటి నుంచి సోషియో, జానపదం, ఫాంటసీ చిత్రాలంటే బాలయ్యకు బాగా ఇష్టం. ఆ కోవలోనే వచ్చిన చిరంజీవి చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి బాగా బాగా నచ్చింది. ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా ఓ ఇంటర్వ్యూలోనే వెల్లడించారు.

చిరంజీవి, శ్రీదేవి కెమిస్ట్రీకి ప్రేక్షకుల జేజేలు
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. ప్రధానంగా చిరంజీవి, శ్రీదేవి మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు జేజేలు పలికారు. ఆ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇళయరాజా సంగీతం ఈ సినిమా బలమైంది. అదే సంవత్సరం బాలయ్య నటించిన 50వ సినిమా నారీ నారీ నడుమ మురారి విడుదలై మ్యూజికల్ హిట్ గా నిలిచింది. తర్వాత లారీడ్రైవర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న విశ్వంభర, బాలయ్య నటిస్తున్న 109వ చిత్రం విడుదల కాబోతున్నాయి. వీరిద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. మొన్నటి సంవత్సరంలో కూడా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో తలపడగా ఇద్దరూ విజేతలుగా నిలిచారు.












Click it and Unblock the Notifications