తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ సంచలన రికార్డ్
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర కథానాయకులు అంటే నలుగురి పేర్లు చెబుతారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. వీరు కొన్ని దశాబ్దాలుగా పరిశ్రమలో రాణిస్తూ తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఈ నలుగురిలో నందమూరి నటసింహం బాలకృష్ణ భీభత్సమైన ఫామ్ లో ఉన్నారని చెప్పొచ్చు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వరుసగా మూడు సూపర్ హిట్ సినిమాలను అందించారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో ఈ అరుదైన ఫీట్ ను బాలయ్య సొంతం చేసుకున్నారు.
ప్రస్తుత రోజుల్లో థియేటర్లలో ఒక సినిమా నెలరోజులు ఆడిందంటే సంవత్సరం ఆడినట్లు లెక్క. కానీ బాలకృష్ణ మాత్రం తన సినిమాలతో కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తూ పాత రికార్డులకు పాతర వేస్తూ ముందుకు వెళుతున్నారు. తాజాగా భగవంత్ కేసరి చిత్రం ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో 100 రోజులు పూర్తిచేసుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరోకు లేనివిధంగా అరుదైన రికార్డును సాధించారు. శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ తదితరులు నటించిన ఈ సినిమా ఇటీవలే రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కురిపించింది.

డైరెక్ట్ గా 12 కేంద్రాలు, షిఫ్టులతో 5 కేంద్రాలు కలిపి 17 కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకోగా, తాజాగా 100 రోజులు కూడా పూర్తిచేసుకుంది. రోజు నాలుగు ఆటలతో ప్రదర్శింపబడింది. రామకృష్ణ థియేటర్ లోనే బాలయ్య గత చిత్రాలు అఖండ 181 రోజులు, వీరసింహారెడ్డి 106 రోజులు ఆడింది. షైన్ స్క్రీన్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. తమన్ స్వరాలందించారు.












Click it and Unblock the Notifications