చిరంజీవి వద్దన్న కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలయ్య బాబు

సినిమా పరిశ్రమలో రచయితలు, దర్శకులు కథను సిద్ధం చేసుకునే సమయంలో వారు ఒక హీరోను దృష్టిలో పెట్టుకుంటారు. అతని బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా కథలో కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటారు. చివరకు హీరో దగ్గరకు వెళ్లి కథను వినిపిస్తారు. అయితే ఆ కథ హీరోకు నచ్చకపోవచ్చు.. లేదంటే కథ బాగా నచ్చినా వేరే సినిమాలతో బిజీగా ఉండటంవల్ల కాల్షీట్లు ఖాళీగా లేక చేయలేకపోవచ్చు. అంతేకాకుండా ఆ కథను తిరస్కరించడానికి అనేక కారణాలుంటాయి. చివరకు ఆ కథ వేరే హీరో దగ్గరకు చేరుతుంది. ఆ హీరోకు కూడా ఒకవేళ నచ్చకపోతే మరో హీరో వద్దకు చేరుతుంది. ఇలా కథ నచ్చేవరకు హీరోలచుట్టూ తిరుగుతుంటుంది.

ఇన్ స్పెక్టర్ గా రౌడీయిజం
బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య, విజయశాంతి నటించిన రౌడీ ఇన్ స్పెక్టర్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా ఈ సినిమాను చిరంజీవితో చేయాలని దర్శకుడు భావించారు. కథ కూడా వినిపించినప్పటికీ కాల్షీట్లు ఖాళీలేక ఆ సినిమాను చేయలేకపోయాడు. దీంతో బి.గోపాల్ ఈ కథను బాలయ్యకు చెప్పి ఒప్పించారు. దీంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమా విడుదలైన తర్వాత సంచలన విజయం సాధించింది. ఓ పాట, ఓ ఫైట్, ఓ డైలాగ్.. ఈ తరహాలో సినిమా సాగుతుంది. ఇన్ స్పెక్టర్ పాత్రలో బాలకృష్ణ రౌడీయిజం చూపించడం సినిమాకు బాగా హైలైట్ అయింది.

nandamuri balakrishna scored a block buster hit hit with Chiranjeevi s missing story

చిరుకన్నా బాలయ్యకే సెట్ అయింది
వాస్తవానికి ఈ సినిమా చిరంజీవికన్నా బాలయ్యకే బాగా కుదిరిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బాలయ్యను దర్శకుడు చూపించిన తీరు, ఆయన కనపరిచిన నటన, చెప్పిన డైలాగులన్నీ ఆకట్టుకున్నాయి. బి.గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమా మిస్ చేసుకున్నందుకు చిరు బాధపడ్డాడు. తర్వాత వైజయంతీ మూవీస్ పతాకంపై బి.గోపాల్ దర్శకత్వంలోనే ఇంద్ర సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. అలాగే బాలయ్య బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలు రెండూ సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి మరోసారి ఈ ఇద్దరు హీరోలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+