'బుక్ మై షో'లో బాలకృష్ణ సంచలన రికార్డ్

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబరు 19వ తేదీన విడుదల కాబోతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీల బాలకృష్ణ కూతురి పాత్ర పోషిస్తోంది. అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందించారు.

ఆ సీన్స్ వేరే లెవల్ : శ్రీలీల ఇప్పటికే భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను 8వ తేదీ రాత్రి 8.16 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. థమన్ బీజీఎం ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుక్ మై షోలో భగవంత్ కేసరికి 1,26,000 ఇంట్రెస్టెడ్ లైక్స్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇందులో యాక్షన్ సీన్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది.

nandamuri balkarishna new record in book my show

బాక్సాఫీస్ వద్ద సంచలనమే : అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. భగవంత్ కేసరిలో ట్విస్టులు సైతం సరికొత్తగా ఉండనున్నాయని, నటన పరంగా బాలకృష్ణ, శ్రీలీల, కాజల్, అర్జున్ రాంపాల్ పోటీపడి నటించారని, వారి నటన అందరినీ ఆకట్టుకుంటుందని, అలాగే కూతురి సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకుల మెప్పు పొందుతుందంటున్నారు. ఈ సినిమా విడుదలై తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్య నటించనున్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ-2 చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+