ఒకే బాటలో నందమూరి బ్రదర్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అతని సోదరుడు కల్యాణ్ రామ్.. ఇద్దరూ ఒకే బాటలో నడుస్తున్నారు. తారక్ తాజా చిత్రం దేవర రెండు భాగాలుగా ఉంటుందని దర్శకుడు కొరటాల అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు షూటింగ్ ప్రారంభోత్సవం వాయిదా పడుతూ ఎట్టకేలకు నిర్విరామంగా జరుగుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ 'డెవిల్'. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. నిర్మాత అభిషేక్ నామా 'డెవిల్' కోసం మొదటిసారి మెగాఫోన్ పట్టారు. నవంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. డెవిల్ సినిమా కూడా రెండు భాగాలుగా రానుందట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయని, మొదటి భాగం విడుదల కాగానే, రెండో భాగం సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. రెండో భాగానికి కూడా అభిషేక్ నామానే దర్శకత్వం వహించే అవకాశముందని సమాచారం.

ఇలా అన్నదమ్ములిద్దరూ ఒకే సినిమాను రెండు భాగాలుగా చేశారని, ఒకేమాటమీద, ఒకేబాటమీద సాగుతున్నారనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. కల్యాణ్ రామ్ కు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులను తొలగించి దేవర సినిమాలో తారక్ భాగం చేశాడు. అంతేకాదు.. బయట ఏదైనా ఫంక్షన్లకు వెళ్లాలన్నా ఇద్దరూ కలిసే వెళుతున్నారు. లేదంటే వెళ్లడంలేదు. ఒకే మాట మీద ఉంటున్నారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ విషయంలో కూడా ఇద్దరూ స్పందించలేదు. వారి మనసుల్లో ఏముందో..?












Click it and Unblock the Notifications