బాలయ్య మైండ్‌బ్లోయింగ్ స్కెచ్... రూ.1200 కోట్ల డైరెక్టర్‌తో మోక్షజ్ఞ మూవీ
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎట్టకేలకు వెండితెరకు పరిచయం అవుతున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి బాలయ్య అభిమానులు ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పరిచయం అవబోతున్నాడు. పురాణాలు, ఇతిహాసాల నుంచి స్ఫూర్తిగా తీసుకొని కథను తయారు చేసిన దర్శకుడు బాలయ్య తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకోబోతోంది. దీనితర్వాత మోక్షజ్ఞ రెండో సినిమాను కూడా బాలకృష్ణ సిద్ధం చేసి ఉంచారు. ఎంతోమంది కథానాయకులను పరిచయం చేసిన వైజయంతీ మూవీస్ బ్యానరుపై ఈ చిత్రం నిర్మించబోతున్నారు.
దర్శకుడిగా నాగ్ అశ్విన్
అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాకు దర్శకుడు ఎవరో కాదు.. ఆయన అల్లుడు.. కల్కి డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్. ఇటీవలే కల్కిద్వారా రూ.1200 కోట్లు కొల్లగొట్టిన అశ్వనీదత్ తన తర్వాత సినిమాగా మోక్షజ్ఞతో తీయబోతున్నారు. ఈ కాంబినేషన్ ను ఇంతవరకు ఎవరూ ఊహించలేకపోయారు. నాగ్ అశ్విన్ మోక్షజ్ఞ కోసం ఎటువంటి కథ తయారుచేస్తాడా? అనే ఉత్కంఠలో అభిమానులున్నారు. దీంతో మొదటిసినిమాతోపాటు మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తీయబోయే సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, లెజెండ్ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్, మతుకుమల్లి తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రూ.30 లక్షలతో సెట్
దీనికి సంబంధించి ఇటీవలే రూ.30 లక్షలతో సెట్ కూడా నిర్మించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా అనుకోని కారణాలతో అది వాయిదా పడింది. మంచి ముహూర్తం చూసుకొని త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించి వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ లో భాగంగా వస్తుండటంతో పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు. మొదటి, రెండో సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగానే చేయనుండటంతో చివరకు మోక్జజ్ఞ పాన్ ఇండియా హీరోగానే స్థిరపడతారని నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు.












Click it and Unblock the Notifications