ఢిల్లీలో బాలయ్య, తారక్- ప్రధాని సమక్షంలో: అరుదైన ఘట్టం..!!
ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ కు అరుదైన అవార్డు అందుకోనున్నారు. బాలకృష్ణ కు కేంద్రం పద్మభూషన్ అవార్డు ప్రకటించింది. రేపు (సోమవారం) రాష్ట్రపతి భవన్ లో పలువురు ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి పద్మ అవార్డులను ప్రధానం చేయనున్నారు. ఈ వేడుక కోసం నందమూరి - నారా కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ అవార్డు పురస్కారం వేళ వీరంతా ఒకే వేదిక మీదకు రావటం ఆకర్షణీయంగా మారుతోంది.
రాష్ట్రపతి భవన్ లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రేపు(సోమవారం )సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు ముహూర్తంగా నిర్ణయించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ దంపతులు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొనేందుకు నందమూరి - నారా కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ సైతం ఢిల్లీకి వస్తున్నట్లు చెబుతున్నారు.

బాబాయ్ బాలయ్య అవార్డు అందుకునే వేళ తారక్ హాజరు పైన ఉత్కంఠ కొనసాగుతోంది. తారక్ ఈ కార్యక్రమానికి వస్తే ప్రత్యేక ఆకర్షణగా నిలవటం ఖాయమని భావిస్తున్నారు. ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డుల ప్రధానం జరగనుంది. బాలకృష్ణ తన సినీ రంగంతో పాటుగా రాజకీయం.. సేవా రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. అయిదు దశాబ్దాల కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. 1960ల్లో సీనియర్ ఎన్టీఆర్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నందమూరి వంశానికి పద్మ పురస్కారం లభించడం ఇదే. ఆరు పదుల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలకృష్ణ. 'అన్‌స్టాపబుల్' కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా ఆయన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు పద్మభూషన్ అవార్డు అందుకుంటున్న వేళ బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications