50 ఏళ్ల వయసులో పవిత్రతో బంధం.. నరేష్ కొడుకు షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అటు కామెడీ అయినా రొమాంటిక్ పాత్రలైనా.. ఎమోషనల్ పాత్రలైనా తనదైన శైలిలో అలరిస్తున్నారు. కెరీర్ తొలిదశలో 'నలుగురు స్తంభాలాట', 'శ్రీవారికి ప్రేమలేఖ', 'చిత్రం భళారే విచిత్రం' వంటి కామెడీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నరేష్. ముఖ్యంగా దర్శకుడు జంధ్యాల సినిమాలతో ఆయన ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా ఉన్నారు. చిన్నా పెద్దా అని సినిమాల తేడా లేకుండా పాత్రలకు ప్రాణం పోస్తూ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే ప్రస్తుతం నరేష్- నటి పవిత్ర లోకేష్ కలిసి జీవిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ అధికారికంగా పెళ్లి చేసుకున్నట్లు ఎక్కడా ప్రకటించకపోయినా ప్రేమించుకున్నట్టు, వీరిద్దరూ కలిసి తమ ప్రయాణాన్ని ప్రారంభించాలని కోరుకున్నట్లు వీళ్లే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇద్దరూ కలిసి 'మళ్లీ పెళ్లి' అనే సినిమాను కూడా తీశారు. అయితే ఇది వారి నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిందని రూమర్స్ కూడా వచ్చాయి.

అయితే తాజాగా నరేష్ - పవిత్ర బంధంపై నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా నవీన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి నరేష్ పవిత్రతో కలిసి ఉండటంపై స్పందించారు. నవీన్ మాట్లాడుతూ.. 'పవిత్ర గారు చాలా మంచి మనిషి. ఆమె అందరిని ప్రేమగా పలకరిస్తుంది. అందరితోనూ ఇట్టే కలిసిపోతుంది. నాన్నకు ఆమె సరైన జోడి అని నా అభిప్రాయం. 50 ఏళ్ల వయసులో నాన్న ప్రశాంతంగా ఉండటానికి ఆమే కారణం. ఇది మంచి విషయమే" అని నవీన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రేమకు ఎలాంటి హద్దులు లేవు అనడానికి ఇది నిదర్శనం అని తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications