ఒకప్పుడు వాచ్ మెన్.. ఇప్పుడు స్టార్ హీరో.. 200 కోట్ల ఆస్తికి యజమాని.. ఎవరో తెలుసా?
ఒకప్పుడు వాచ్ మెన్.. ఇప్పుడు స్టార్ హీరో.. 200 కోట్ల ఆస్తికి యజమాని.. ఇది ఎలా సాధ్యం. పేద కుటుంబంలోనుంచి వచ్చి అగ్రహీరోగా ఎలా రాణిస్తున్నారు? దిక్కూమొక్కూ లేకుండా వచ్చి తన నటనతో ఇండస్ట్రీని శాసిస్తున్న నటుడు ఎవరో తెలుసా..? చాలా మంది సినిమాల్లో నటించడం అంటే చాలా ఈజీ అనుకుంటారు. కానీ ఆ స్టేజ్ కు రావడానికి నిజ జీవితంలో సినిమా కష్టాలే పడతారు కొంతమంది. ప్రతిభ, పట్టుదల ఉంటే అడ్డంకులను అధిగమించి అద్భుతమైన విజయం సాధించవచ్చని నిరూపించిన నటుడు ఆయన.. ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ.. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం.
ఇండస్ట్రీకి రాకముందు ఆయన చేయని పనిలేదు. అత్యంత పేదరికం నుంచి వచ్చాడు నవాజుద్దీన్. కానీ ఆయన లక్ష్యం మాత్రం నటుడు కావడమే. అందకు ఆయన చేయని పని లేదు.. వాచ్‌మెన్ గా పనిచేశాడు. దిల్లీలో సెక్యూరిటీ గార్డ్ గా.. ముంబై వీధుల్లో కూరగాయలు కూడా అమ్మాడు. అలా వచ్చిన డబ్బుతో నెమ్మదిగా నటన నేర్చుకున్నాడు. బాలీవుడ్‌లోని చిన్న చిన్న పాత్రల కోసం ఆడిషన్‌కు పిలుపు వచ్చేది. చాలాసార్లు రిజెక్ట్ అయ్యాడు. అయినా పట్టువదలకుండా ప్రయత్నించాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ.
పేద రైతు కుటుంబంలో..
ఉత్తరప్రదేశ్‌లోని బుధానాలో ఓ పేద రైతు కుటుంబంలో నవాజుద్దీన్ జన్మించాడు. చిన్నప్పటినుంచే నటనపై ఆయనకు మక్కువ ఎక్కువ. బాలీవుడ్‌కు వెళ్లాలనేది అతని కల. కానీ నవాజుద్దీన్ అంత అందంగా లేకపోవడం.. బాలీవుడ్ ప్రముఖలతో సంబంధాలు లేకపోవడం వల్ల ఆయన ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అలా తొలిసారి సర్ఫరోష్ (1999) చిత్రంలో ఆయనకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత శూల్ (1999) చిత్రంలో నచించాడు. కానీ ఈ రెండు మూవీస్ లో ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. అంత చిన్న పాత్రలు అవి. దీంతో అతని నటనను ఎవరూ గుర్తించలేదు. కానీ నవాజ్ ఎక్కడా నిరుత్సాహ పడలేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
అలా నవాజుద్దీన్ గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ (2012)సినిమాతో ఒక్క సారిగా బ్లాస్ట్ అయ్యాడు. ఈ సినిమాలో ఫైజల్ ఖాన్ పాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల నుంచి మంచి గుర్తింపు లభించింది. దీంతో ఆయనకు ఒక్కసారిగా ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత కహానీ (2012), ది లంచ్ బాక్స్ (2013), మంఝీ: ది మౌంటెన్ మ్యాన్ (2015) సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఆ తర్వాత సేక్రేడ్ గేమ్స్ (2018), మాంటో (2018) సినిమాలతో మెరిశాడు.

తెలుగులోనూ విలన్ గా రాణించాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. విక్టరీ వెంకటేశ్ 75వ చిత్రం సైంధవ్ లో విలన్ పాత్రలో నవాజుద్దీన్ నటన ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్దిఖీ సెక్షన్ 108, నూరానీ చెహ్రా, సంగీన్, రాత్ అఖేలీ హాయ్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications