తెలుగులో అత్యంత రిచెస్ట్ హీరోయిన్లు వీరే
హీరోయిన్లు అంటే ఒకప్పడు ఎవరూ పట్టించుకునేవారు కాదు. నాలుగు సినిమాల్లో నటించి నాలుగు రాళ్లు వెనకేసుకున్న తర్వాత పెళ్లి చేసుకొని పరిశ్రమ నుంచి తప్పుకునేవారు. అయితే తరం మారడంతోపాటు ఆలోచనలు కూడా మార్చుకుంటున్నారు మన హీరోయిన్లు. హీరోయిన్లు అంటే కేవలం నాలుగైదు సంవత్సరాలు లేదంటే మహా అయితే పది సంవత్సరాలు అనే మాటను చెరిపేస్తూ 20 సంవత్సరాల నుంచి హీరోయిన్లుగా చెలామణి అవుతున్నవారు ఉన్నారు. అంతేకాదు.. వారే టాప్ స్థానంలో ఉంటున్నారు.
సినిమాకు రూ.10 నుంచి రూ.12 కోట్లు
అటువంటివారి జాబితాలో నయనతార, త్రిష, తమన్నా, సమంత, కాజల్ లాంటివారు నిలుస్తారు. అంతేకాదు.. హీరోలకు ధీటుగా హీరోయిన్లు పారితోషికాలను తీసుకుంటున్నారు. వాటిని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ వాటినుంచి మళ్లీ రూ.కోట్ల రాబడుతున్నారు. రోజురోజుకు ఈ హీరోయిన్ల ఆస్తి విలువ భారీగా పెరుగుతూ వస్తోంది.

మన దక్షిణ భారతదేశంలో అత్యంత సంపన్నమైన హీరోయిన్ ఎవరు అంటే నయనతార అని ఘంటాపథంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ.300 కోట్ల పైన ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు పారితోషికం తీసుకునే నయనతారకు కేరళ, ముంబయి, హైదరాబాద్, చెన్నై లాంటి దేశంలోని ప్రధాన నగరాల్లో రూ.100 కోట్ల విలువ చేసే లగ్జరీ ఇళ్లు ఉన్నాయి.

అనుష్కకు రూ.135 కోట్లు
దక్షిణాదిలో అత్యంత ఖరీదైన హీరోయిన్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచన అనుష్క నికర ఆస్తుల విలువ రూ.135 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలు చేసిన తర్వాత సినిమాలకు కొంతకాలం విరామం ప్రకటించింది. ప్రస్తుతం మళయాళంలో కత్నార్-ది వైల్డ్ సోర్సెరర్ సినిమాలో నటిస్తోంది ఒక్కో సినిమాకు ఆమె రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. 20 ఏళ్ల నుంచి టాప్ హీరోయిన్ గా రాణిస్తోన్న త్రిష ఒక్కో సినిమాకు రూ.6 నుంచి రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఆస్తులు విలువ రూ.100 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.













Click it and Unblock the Notifications