బాలయ్య సరసన నయనతార, కాజల్ అగర్వాల్

మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య నటించే సినిమా ఒక చారిత్రక నేపథ్యంలో ఉంటుందని అందరూ భావించారు. అయితే కథను పూర్తిగా మార్చేసి ముంబయి మాఫియా బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య అత్యంత శక్తివంతమైన మాఫియా డాన్ గా కనిపించబోతున్నారు. మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే డైలాగులు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ స్క్రిప్ట్‌ను గోపీచంద్ అద్భుతంగా తీర్చిదిద్దారని తెలుగు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే.. ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన హీరోయిన్లుగా నయనతార, కాజల్ లాంటి అందాల భామలు తెరను పంచుకోబోతున్నారు.

ఇద్దరు హీరోయిన్లతో ఆడిపాడబోతున్న బాలయ్య

సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, నయనతార,కాజల్ ఇద్దరూ కలిసి నటించబోతున్నారని తెలుస్తోంది. 'భగవంత్ కేసరి' హిట్‌తో బాలయ్య-కాజల్ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ రావడంతో, అదే సెంటిమెంట్‌ను ఇక్కడ కూడా రిపీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. బాలయ్య-నయనతార కాంబో అంటే అది సూపర్ హిట్ కాంబో అని చెప్పొచ్చు. వీరిద్దరూ కలిసి నటిస్తే సినిమా హిట్ అవడం గ్యారంటీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Nayantara and Kajal aggarwal to star opposite nandamuri balakrishna in Gopichand malineni film

ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని, సెకండ్ షెడ్యూల్ కోసం ముంబైలో భారీ సెట్టింగ్స్ వేశారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయ్యాయని, తమన్ తన ట్రేడ్‌మార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లబోతున్నారని టాక్. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజస్థాన్ లో కూడా షూటింగ్ జరుగుతోంది.

దసరాకు లేదంటే సంక్రాంతికి

బాలయ్య వరుసగా 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో వస్తున్న 111వ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. 'వీరసింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ - బాలయ్య కాంబో రిపీట్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద మళ్లీ మాస్ జాతర ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమాను 2026 విజయదశమికి లేదంటే 2027 సంక్రాంతి రేసులో నిలపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. దసరాకు సినిమా పూర్తయితే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే యోచనలో బాలయ్య ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+