అతనికి పబ్లిక్‌గా ముద్దు పెట్టిన నయనతార
సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. వివాహం తరువాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నుంచి కూడా నయనతారకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల కాలంలో నయనతార సోషల్ మీడియాలో ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది.

బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో పడేందుకు వరుస బాలీవుడ్ ఈవెంట్స్‌లో హాజరవుతోంది. తాజాగా నయనతార, భర్త విఘ్నేష్ శివన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీరిద్దరు కలిసి వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లినట్టు ఈ ఫొటోలను చూస్తే అర్థం అవుతోంది. విఘ్నేష్ శివన్ పుట్టిన రోజు సందర్భంగా నయనతార చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ''నేను నిన్ను ఎంతలా లవ్ చేస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు.నువ్వు కన్న కలలు నిజం కావాలని దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా'' అంటూ నయన్ తన పోస్ట్‌లో పేర్కొంది. నయనతార షేర్ చేసిన ఫోటోలు, పోస్ట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.భర్తపై నయన్ చూపించిన ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం నయనతార చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications