చిరంజీవి ఎవరో నాకు తెలియదు..!

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు...వెలుగుతున్నారు కూడా. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ వన్ హీరోగా చిరంజీవి నిలిచారు.ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు.

సినిమాల్లో వచ్చిన క్రేజ్‌తో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే చాలామంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అవ్వడాన్ని కళ్లారా చూసి కూడా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 సార్వత్రిక ఎన్నికల ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఎన్నో అంచనాల మధ్య పోటీ చేసిన ప్రజారాజ్యం కేవలం 18 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది.

NEtizen asking who is chiranjeevi

ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఓ చోట ఓడిపోయి, మరో స్థానంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చిరంజీవి తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో చిరంజీవి ఓడిపోవడం ఆయనకు మాయని మచ్చలా నిలిచింది. ఇదింతా ఇప్పుడు ఎందుకని అనుకుంటున్నారా..? ఏం లేదండీ తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌కు చిరంజీవి సైతం హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

NEtizen asking who is chiranjeevi

చిరంజీవి ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌కు వచ్చారని ఓ స్పోర్ట్స్ అనలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్‌ను చేశారు.అయితే దీనిపై ఓ నెటిజన్ ఎవరితను అని అడిగారు. దీనికి మరో నెటిజన్ రామ్ చరణ్ తండ్రి అంటూ రిప్లై ఇస్తారు. అసలు రామ్ చరణ్ ఎవరంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు.అయితే దీనిపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తెలియకపోవడం ఏంటని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+