విడాకులపై తొలిసారి స్పందించిన నిహారిక కొణిదెల...
టాలీవుడ్‌లో చాలా జంటలు విడాకులు తీసుకున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక కొడిదెల కూడా ఈ విడాకుల జాబితాలో చేరిపోయింది. మెగా ప్రిన్సెస్ నిహారిక చైతన్య జొన్నలగడ్డను ప్రేమ వివాహం చేసుకుంది. నిహారిక టాలీవుడ్‌లో ఓ రెండు మూడు సినిమాల్లో కూడా నటించింది. ఆ సినిమాలేవీ నిహారికకు పెద్ద స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టలేదు. నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంతో వైభవంగా జరిగింది. ఈ ప్రేమజంట ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోయారు. పెళ్లయిన ఏడాదిలోపే ఈ జంట విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. అలా కొన్ని రోజుల తర్వాత వీరిద్దరూ విడాకుల గురించి అధికారికంగా అనౌన్స్ చేశారు. విడాకుల విషయంపై చాలా రోజుల తర్వాత నిహారిక తొలిసారిగా స్పందించింది.
ఈ మధ్యకాలంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకులు ప్రస్తావన తీసుకొచ్చింది. తన పెళ్లి బంధం సంవత్సరంలోనే ముగిసిపోతుందని అనుకోలేదని, నా పెళ్లి మిగిల్చిన బాధతో ఎవరినీ ఈజీగా నమ్మకూడదని తెలుసుకున్నాని అని చెప్పింది. డివర్స్ తీసుకుంటే లైఫ్ ముగిసిపోయినట్లు కాదని తెలిపింది. నా ప్రేమ, పెళ్లి అనేవి నాకు ఒక పాఠాన్ని నేర్పించాయని, వీటి ద్వారా ఎదుటివారిని ఈజీగా నమ్మకూడదని తెలుసుకున్నానని చెప్పింది. ఇప్పటికీ నా పెళ్లి, విడాకులు గుర్తొస్తే కన్నీళ్లు ఆగవని ఎమోషనల్ అయ్యింది. తాను ఊహించినట్టు ఏదీ జరగలేదని అందుకే పెళ్లి బంధాన్ని ముగించేశానని తెలిపింది. తన కుటుంబ సభ్యులు, తన స్నేహితులు తన గురించి ఏమనుకుంటారో అది ముఖ్యమని, తనకు తెలియని వారు, సంబంధం లేనివారు ఏమనుకున్నా తాను పట్టించుకోనని నిహారిక చెప్పుకొచ్చింది.

విడాకులపై ట్రోలింగ్ : పెళ్లయిన సంవత్సరంలోనే నిహారిక విడాకులు తీసుకోవడంపై ఆమెపై నెటిజన్లు చాలా దారుణంగా ట్రోల్స్ చేశారు. చాలామంది డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడంపై విమర్శలు గుప్పించారు. కానీ, నిహారిక వాటన్నింటిపై ఘాటుగానే స్పందించింది. కొత్తగా పెళ్లి చేసుకునే ఏ జంట అయినా తమ జీవితం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు. అది ఆలోచించే వివాహ బంధంలోకి అడుగుపెడతారు. నేను అదే చేశాను అని చెప్పుకొచ్చింది. ఈ రెండుసంవత్సరాలు కుటుంబ బంధాల గురించి బాగా అర్థం చేసుకున్నానని చెప్పింది. తనను తన కుటుంబ సభ్యులు భారంగా ఎప్పుడూ భావించలేదని తెలిపింది. ఇక విడాకుల తర్వాత మళ్లీ సినిమాలు తీయాలని నిర్ణయించుకుంది నిహారిక. ప్రస్తుతం తెలుగు, తమిళంలో రెండు సినిమాలు తన చేతిలో ఉన్నాయి. ఇక, ఇప్పటికే 'డెడ్ పిక్సెల్స్' అనే వెబ్ సిరీస్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిహారిక కేవలంనటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications