ఆ సినిమా చేయనందుకు ఇప్పటికీ బాధపడుతున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఇద్దరూ కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగొ కొనసాగుతున్నారు. ఎంతోమంది యువహీరోలు వచ్చినప్పటికీ ఇప్పటికీ వీరిద్దరు మాత్రం పోటాపోటీగా సినిమాలు చేస్తూ వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతమంది స్టార్ హీరోలు సినిమాలు విడుదలవుతున్నప్పటికీ బాలయ్య, చిరు సినిమాలు విడుదలవుతున్నాయంటూ అభిమానుల్లో ఉండే క్రేజ్ చాలా విభిన్నంగా ఉంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మరోసారి వీరిద్దరూ తలపడబోతున్నారు.
ఒకరు వద్దంటే మరొకరికి వరం
సాధారణంగా సినిమాలకు కథ రాసుకునే సమయంలో దర్శకుల దృష్టిలో ఒక హీరో ఉంటాడు. అతని బాడీలాంగ్వేజ్ కు అనుగుణంగా కథను తయారు చేస్తారు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో సదరు హీరోలు ఆ సినిమాలను తిరస్కరిస్తే వేరే హీరోలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటారు. చిరంజీవి, బాలకృష్ణ విషయంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ ముందుగా మంగమ్మగారి మనవడు సినిమా కథను చిరంజీవి దగ్గరకు తీసుకువెళ్లారు. అయితే చిరుకు కథ నచ్చకపోవడంతో కోడి రామకృష్ణ ఆ కథను బాలయ్యకు వినిపించారు.

ఏడాదికిపైగా ఆడింది
ఆ కథ బాలయ్యకు బాగా నచ్చటంతో వెంటనే సినిమా తీయడానికి ఏర్పాట్లు చేసి హీరోయిన్ గా సుహాసినిని ఎంపిక చేశారు. భానుమతి రామకృష్ణ కీలక పాత్ర పోషించారు. భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై ఎస్.గోపాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదలైన తర్వాత ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు.. సినీ చరిత్రలో తనకంటూ ఓ పేజీని ఈ సినిమా లిఖించుకుంది.
థియేటర్లలో అత్యధిక రోజులు ఆడింది. కొన్ని థియేటర్లలో ఏడాదికిపైగా, మరికొన్ని థియేటర్లలో దాదాపు 600 రోజులు ప్రదర్శితమైంది. అయితే ఈ సినిమా చేయలేకపోయినందుకు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ బాధపడుతుంటారు. తన సన్నిహితులు, స్నేహితుల దగ్గర కూడా తరుచుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసుంటారు. కొందరు వద్దనుకున్న సినిమాలు మరికొందరికి అద్భుతమైన వరంగా మారతాయనేదానికి మంగమ్మగారి మనవడు ఒక ఉదాహరణగా నిలుస్తుంది.












Click it and Unblock the Notifications