మూడు దేశాలను గడగడలాడించిన వ్యక్తి కథతో ఎన్టీఆర్ సినిమా

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. హృతిక్ రోషన్ తోపాటు మరో హీరోగా వార్ 2 సినిమా చేస్తున్నారు. తాజాగా తొమ్మిదో తేదీన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్న 31వ చిత్రానికి పూజా కార్యక్రమాలు జరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేసే యోచనలో నిర్మాత, దర్శకులున్నారు. రెండు భాగాలుగా రూపొందుతుందని చెబుతున్నారుకానీ చిత్ర యూనిట్ స్పష్టతనివ్వలేదు.

ప్రపంచానికే అతను ఘోరమైన శత్రువు
2026 జనవరి తొమ్మిదో తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రారంభోత్సవంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని ఫజిల్స్ లాంటి విషయాలను గోప్యంగా ఉంచాడు. చెనా, భూటాన్, బెంగాల్-కోల్ కతా ను గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. 1969లో డ్రగ్ డీలర్ ఖున్‌సా భారత్, భూటాన్, చైనాలను వణికించాడు. అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఖున్ సాను ప్రపంచంలో అత్యంత ఘోరమైన శత్రువుగా అభివర్ణించిందంటే అతను ఈ దేశాలను ఎలా గడగడలాడించాడో అర్థం చేసుకోవచ్చు. 1969 బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

NTR and Prashant Neel movie 1696 backdrop on the story of drug lord Khunsa

కథల ఎంపికను మార్చిన తారక్
టెంపర్ సినిమాను పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేశారు. ఆ సినిమా నుంచి తన కథల ఎంపిక విధానాన్ని తారక్ పూర్తిగా మార్చేశారు. ఫ్లాప్ దర్శకులకు అవకాశాలిచ్చి తాను సూపర్ హిట్లు కొట్టారు. వరుసగా డబుల్ హ్రాట్రిక్ సినిమాలు చేశారు. ప్రస్తుతం చేస్తున్న దేవర సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి భాగం సెప్టెంబరు 27వ తేదీన విడుదల కాబోతోంది. తర్వాత వార్ 2 విడుదలవుతుంది. 2026లో ప్రశాంత్ నీల్ చిత్రం విడుదలవుతుంది. ఈ సినిమాకు అసుర అనే పేరును పరిశీలిస్తున్నారు. అసుర లేదంటే అసురుడు అని పెట్టాలనుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది కాబట్టి అసుర అనే పేరు ఖరారవుతుందనుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+