ఐదోసారి కాంబినేషన్ ఫిక్స్.. ఈ సారి ఊహించని జానర్ లో..?

ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్ అంటే అభిమానులకే కాదు సగటు సినీ అభిమానికి పండగే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెం. 1, యమదొంగ, సింహాద్రి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. బాక్సాఫీస్ దుమ్ము దులిపాయి. సరికొత్త రికార్డులు సృష్టించాయి. తాజాగా వీరిద్దరూ మరోసారి ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి సరికొత్త జానర్ లో వీరి సినిమా ఉండనుందని సమాచారం.

ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కలిసి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌ ను నిర్మించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. 'మేడ్ ఇన్ ఇండియా' అనే టైటిల్‌ తో ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఇక దాదాసాహెబ్ ఫాల్కే విషయానికి వస్తే.. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పితామహుడిగా గుర్తింపు పొందారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ బయోపిక్ లో తారక్‌ దాదాసాహెబ్ ఫాల్కే గా నటించనున్నారని తెలుస్తోంది. ఈమేరకు బాలీవుడ్‌ మీడియాలో పలు కథనాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దాదాసాహెబ్ జీవితం సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసింది. దీంతో ఆయన కథను నేటి తరానికి అందించాలన్న ఉద్దేశంతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. తారక్ అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వెళ్తుందని అందుకే ఆయన్ను హీరోగా పెట్టి తీయాలని అనుకుంటున్నట్లు టాక్.

ఇక ఈ బయోపిక్ కు 'మేడ్ ఇన్ ఇండియా' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారట. ఇందులో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే షూటింగ్ కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు.

NTR and Rajamouli Team Up for Dadasaheb Phalke Biopic

దాదాసాహెబ్ ఫాల్కే ను భారతీయ సినిమా పితామహుడిగా అభివర్ణిస్తారు. 1870 లో జన్మించిన ఆయన.. సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ ప్లే రచయితగా ఖ్యాతి పొందారు. 1913లో భారతదేశ మొదటి సినిమా 'రాజా హరిశ్చంద్రను ఆయన తెరకెక్కించారు. దాదాసాహెబ్ ఫాల్కే భారత చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంలో కీలక కృషి చేశారు. ఫాల్కే 1944 లో కన్నుమూశారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+