కొడుకులు, కూతుర్లు, మనవళ్లకు ఎన్టీఆర్ ప్రత్యేక పేర్లు

సినీరంగంతోపాటు రాజకీయ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న నందమూరి తారకరామారావు గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆలంబనగా ఉండేవి. ఇప్పటికీ పేద ప్రజలు ఎన్టీఆర్ ను దేవుడిగా కొలుస్తుంటారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు.

పేర్ల చివర కృష్ణ : సవతారకంను ఎన్టీఆర్ వివాహం చేసుకున్న తర్వాత వీరికి 7గురు కొడుకులు, 4 కూతుర్లు జన్మించారు. హిందూ ధర్మం అన్నా, ఆచారాలు, సంప్రదాయాలు, తెలుగు భాష అంటే ఎన్టీఆర్ కు ఎంతో అభిమానం, గౌరవం. వీరికి పెట్టిన పేర్లు పరిశీలిస్తే తెలుగు భాషపై ఎన్టీఆర్ కు ఎంత పట్టుందో అర్థమవుతుంది. ఏడుగురు కొడుకుల పేర్ల చివర కృష్ణ అనే పదం ఉండేలా పేర్లు పెట్టారు. హరికృష్ణ, రామకృష్ణ, సాయికృష్ణ, జయకృష్ణ, బాలకృష్ణ... అంటూ ఇలా పెట్టారు. కూతుర్లకు చివర ఈశ్వరి అని పేరువచ్చేలా చూసుకున్నారు.

ntr gave special names for his sons and daughters

వీరికి చివరగా ఈశ్వరి : లోకేశ్వరి, పురంధేశ్వరి, ఉమా మహేశ్వరి, భువనేశ్వరి అని పేర్లు పెట్టారు. రెండో తరంలో కూడా ఎన్టీఆర్ పెట్టిన పేర్లు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తన పెద్ద కుమారుడు జయకృష్ణ కుమార్తెకు కుదిమిని , రెండో కుమారుడికి ఇద్దరు కూతుర్లు ఉంటే వారికి శ్రీమంతుని, మనశ్విని అని నామకరణం చేశారు. బాలకృష్ణ ఇద్దరు కూతుళ్లకు బ్రాహ్మిణి, తేజస్విణి అనే పేర్లు పెట్టారు. చిన్న కుమారుడు సాయికృష్ణ కుమార్తె పేరు ఈషాణి అని ఎన్టీఆర్ పెట్టారు. ఈ పేర్లను బట్టి ఎన్టీఆర్ ది ఎంత కళాత్మక హృదయమో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో ఇలా ప్రాస కలిసేవిధంగా ఎవ్వరూ ఇలా పేర్లు పెట్టలేదు. తారక రామారావు ఏది చేసినా అందులో ప్రత్యేకత ఉండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+