ప‌దిరోజులు ముంబైలో మ‌కాం వేయ‌నున్న ఎన్‌టీఆర్‌.. ఎందుకో తెలుసా..?

జూనియ‌ర్ ఎన్‌టిఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. తాజాగా, ఎన్‌టిఆర్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఎన్‌టీఆర్ ఓ ప‌ది రోజుల‌పాటు ముంబైలో మ‌కాం వేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వార్ 2 సినిమాలో ఎన్‌టీఆర్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పడు ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఎన్‌టీఆర్ ముంబై వెళ్లనున్న‌ట్లు స‌మాచారం.

ఈ శుక్ర‌వారం నుంచే ఎన్‌టీఆర్ వార్ 2 షూటింగ్ పాల్గొంటార‌ని బీ టౌన్ వ‌ర్గాల్లో గుసుగుస‌లు వినిపిస్తోన్నాయి. అందుకోసమే ముంబైలో ప‌దిరోజులు ఉండనున్న‌ట్లు తెలుస్తోంది. ముంబైలోని యష్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోలో ప‌ది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ షూటింగ్‌లో హృతిక్ రోషన్- ఎన్టీఆర్ మధ్య కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ షెడ్యూల్‌లో భాగంగానే ఎన్‌టీఆర్ ముంబై బ‌య‌లుదేర‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాతో జూనీయ‌ర్ ఎన్‌టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెట్ట‌బోతున్నారు. బాలీవుడ్ మొద‌టి సినిమాలోనే ఎన్‌టీఆర్ హృతిక్ రోష‌న్‌తో క‌ల‌సి ప‌నిచేస్తున్నారు.

NTR will stay in Mumbai for ten days Do you know why

ఎన్టీఆర్ రోల్‌తో సింగిల్‌గా మ‌రో సినిమా..

వార్ 2 సినిమా గురించి తాజాగా వ‌చ్చిన ఈ అప్డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇక‌, ఈ చిత్రంలో ఎన్‌టీఆర్ ఓ RAW ఏజెంట్‌గా కనింపించ‌బోతున్నార‌ని టాక్‌. ఈ సినిమాలో ఎన్‌టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రానికి అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈయ‌న గ‌తంలో యే జవానీ హై దివానీ, బ్రహ్మాస్త్ర వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. వార్ 2 సినిమా అనంత‌రం ఎన్టీఆర్ రోల్‌తో సింగిల్‌గా మరో సినిమా కూడా ఉండబోతుంద‌ని బీ టౌన్ మీడియాలో వినిపిస్తోంది. ఇక‌, ఈ చిత్రాన్ని 2025 స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+