అక్కినేని కల్ట్ ఫ్యాన్‌ను కలిసిన "అయ్యగారు".. వీడియో వైరల్ !!
తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కినేని నాగార్జున వారసుడిగా సిసింద్రీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు "అఖిల్". ఆ తర్వాత అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. హలో, మిస్టర్ మజ్ను సినిమాల్లో నటించినా.. ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. పూజా హెగ్డేతో కలిసి నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్త పర్వాలేదనిపించినా.. భారీ అంచనాలతో వచ్చిన "ఏజెంట్" మాత్రం డిజాస్టర్ కావడంతో దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు "లెనిన్"తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కాగా వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై.. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం సమకూర్చారు. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని అఖిల్ కి ఫస్ట్ టైమ్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.

ఇక అఖిల్ కి "అయ్యగారు" అనే పేరు ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. గతంలో అక్కినేని ఫ్యామిలీ వీరాభిమాని నాగరాజు.. ''దేనికైనా అయ్యగారే కరెక్ట్. అఖిలే నెం.1. ఏదైనా అఖిల్ వల్లే అవుతుంది.. ఇంకెవరి వల్లా కాదు" అంటూ మాట్లాడిన వీడియో అప్పట్లో నెట్టింట తెగ వైరల్ అయింది. అప్పటి నుంచే అఖిల్ ను 'అయ్యగారు' అని పిలవడం మొదలుపెట్టారు. అఖిల్ సైతం దాన్ని ట్రోల్ మాదిరిగా తీసుకోకుండా.. తన అభిమాని పెట్టిన పేరును పాజిటివ్ గా తీసుకొని అతన్ని కలవాలి అంటూ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు లేటెస్ట్ గా గుంటూరులో జరిగిన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అనంతరం అఖిల్.. నాగరాజును తన కార్వాన్ లోకి పిలిపించుకుని కాసేపు మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఎక్స్ లో పోస్ట్ చేసింది. నాగరాజు కార్వాన్ లోకి అడుగుపెట్టగానే అఖిల్ కాళ్ల మీద పడబోగా.. అలా చేయొద్దంటూ అఖిల్ అతన్ని ప్రేమగా హగ్ చేసుకున్నారు.
అలానే 'ఇప్పుడు హ్యాపీగా ఉన్నావ్ కదా' అనగా.. అతను ఎమోషనల్ అయ్యాడు. "నీ వల్లే నాకు అయ్యగారు అనే పేరొచ్చింది" అని అఖిల్ చెప్పగా.. ఆ అక్కినేని వీరాభిమాని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మళ్లీ ఇంకో హిట్టు కొడదాం అని అఖిల్ అంటుండగా.. ఈసారి కొడితే ఇంకా పైకి వెళ్లిపోవాలంటూ నాగరాజు భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న తన సతీమణి జైనబ్ ను అఖిల్ అతనికి పరిచయడం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
The most famous "Ayyagare"...
— Annapurna Studios (@AnnapurnaStdios) July 15, 2026
Finally met his favourite "Ayyagaru." ❤️
A moment worth every celebration... and one that will be remembered for a long time 🫶🏻@AkhilAkkineni8 #Nagaraju#Lenin #BlockbusterLenin pic.twitter.com/HFejwxbew7












Click it and Unblock the Notifications