Pushpa-2: పుష్ప-2 టికెట్ల పెంపుపై హైకోర్టులో విచారణ..
పుష్ప-2 మూవీ టికెట్ రేట్ల పెంపుపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. సతీష్ అనే వ్యక్తి టికెట్ ధరల పెంపుపై పిటిషన్ దాఖలు చేశారు. పుష్ప-2 బెనిఫిట్ షో టికెట్ ధరలు భారీగా పెంచారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాకుండా షో టామ్ రాత్రి ఒంటి వరకు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకే ఈ సినిమా విడుదలను ఆపాలని కోర్టును కోరారు. బడ్జెట్ అనుగుణంగానే టికెట్ల ధరలు పెంచినట్లు పుష్ప-2 తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు.
బెనిఫిట్ షోకు పిల్లలు, ఫ్యామిలీ వారు వచ్చే అవకాశం చాలా తక్కువ అని పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు సినిమా విడుదల నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అయితే బడ్జెట్ తో పాటు బెనిఫిట్ షో వసూళ్ల వివరాలు కోర్టుకు సమర్పించాలి హైకోర్టు ఆదేశించింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లో 12500 థియేటర్లలో డిసెంబర్ 5న పుష్ప-2 విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులు సృష్టించింది.

డిసెంబర్ 4 రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షోలు కూడా వేస్తున్నారు. ప్రీమియర్ షోల టికెట్ ధరపై రూ. 800 పెంచారు. సింగిల్ స్క్రీన్స్ అప్పర్ క్లాసుకు రూ.150, లోయర్ క్లాసుకు రూ.100, మల్టీప్లెక్స్ లో రూ.200 వరకు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని 6 భాషల్లో ఏడు ఫార్మాట్లలో ఈ మూవీ విడుదల కానుంది. ప్పటికే ఈ మూవీకి సంబంధించి 6.6 లక్షల కోట్ల టికెట్లు బుక్ అయినట్లు చెబుతున్నారు. ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్లో ఇప్పటికే 50 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి.












Click it and Unblock the Notifications