రాజమౌళి - మహేష్ బాబు మూవీపై ఒడిశా డిప్యూటీ సీఎం హాట్ కామెంట్స్..

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో జంటగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా ఈ మూవీ వస్తుండడంతో SSMB29అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. రాజమౌళి, మహేష్ బాబు కెరీర్ ల లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. గతంలో రాష్ట్రంలోని మల్కాన్‌గిరిలో పుష్ప-2 చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో వస్తున్న SSMB29 సినిమా కోరాపుట్‌లో షూటింగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారని రాసుకొచ్చారు.

odisha-deputy-cms-shocking-comments-on-rajamouli-mahesh-babu-movie

ఇంతటి ప్రఖ్యాత చిత్రం షూటింగ్ ఒడిశాలో జరుగుతుండడం.. ఇక్కడ సినిమాటిక్ ల్యాండ్‌ స్కేప్‌ల సంపద ఉందని రుజువు చేస్తుందని అన్నారు. అంతే కాకుండా ఒడిశా పర్యాటక రంగానికి ఇకి చాలా పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని రాసుకొచ్చారు. రానున్న రోజుల్లో సినిమా షూటింగ్స్ కోసం ఒడిశా గమ్యస్థానంగా మారుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని చలనచిత్ర పరిశ్రమలను మేము స్వాగతిస్తున్నామని.. షూటింగ్స్ కు పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇస్తున్నామని ప్రవతి పరిదా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఏ అప్డేట్ ని అధికారికంగా మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయకుండానే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. సాధారణంగా రాజమౌళి సినిమాలు కట్టుదిట్టమైన భద్రత మధ్య షూటింగ్స్ జరుపుకుంటాయి. సెట్స్ లోకి మొబైల్ ఫోన్లను కూడా తీసుకెళ్లనివ్వరు. ఎలాంటి చిన్న విషయం కూడా బయటకు లీక్ అవ్వకుండా కేర్ తీసుకుంటారు.

లీకుల పర్వం..

కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం అఫీషియల్ గా ప్రకటించక ముందే ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టింగ్ కి కామెంట్స్ చేయడంతో రివీల్ అయ్యింది. అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారని గత కొంత కాలంగా టాక్ నడుస్తోంది. రీసెంట్ గా మహేశ్ తో పాటుగా ఆయన కూడా ఎయిర్ పోర్టులో కనిపించడంతో అది కూడా రివీల్ అయ్యింది. ఇక ఇప్పుడు డిప్యూటి సీఎం చేసిన ట్వీట్ లో సదరు నటీనటులు నటిస్తున్నారని పోస్ట్ చేయడం ఇంకాస్త హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఇప్పటికే ఈ సినిమా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంతమేర చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ గా ఒడిశాలో షూటింగ్ కి సంబంధించి మహేష్ బాబు వీడియో లీక్ అయ్యి వైరల్ అయిన విషయం తెలిసిందే. మరి రానున్న రోజుల్లో అయిన మూవీకి సంబంధించి ఏం లీక్ అవ్వకుండా జక్కన్న జాగ్రత్త తీసుకుంటారో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+