పవన్‌కల్యాణ్ - సుకుమార్ కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్
పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసి అనేక అవమానాలను తట్టుకొని, విమర్శలకు ఎదురొడ్డి నిలిచి పార్టీకి 100 శాతం విజయాన్ని కట్టబెట్టారు. తాను భారీ మెజార్టీతో పిఠాపురం నుంచి విజయాన్ని సాధించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తన పనితీరుతో ఇప్పటికే అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటువంటి సమయంలో సినిమాలు చేయడం అనేది చాలా కష్టంగా మారింది. గతంలో షూటింగ్ జరుపుకున్న సినిమాలకే డేట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. హరిహరవీరమల్లు, ఓజీ, హరీష్ శంకర్ సినిమాలున్నాయి. వచ్చే ఏడాది మాత్రం హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు విడుదల కానున్నాయి.
పవన్ తో చర్చలు జరిగాయికానీ..
పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో దర్శకుడు సుకుమార్ పవన్ కోసం ఓ కథ రాసుకున్నారు. దీనిపై పవన్ తో చర్చలు జరిగాయి. సుకుమార్ తో సినిమా అంటే భారీగా కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సంవత్సరాల తరబడి సినిమా చేయాల్సి ఉంటుంది. ఓవైపు రాజకీయాలతో, మరోవైపు సినిమాలతో బిజీగా ఉండే పవన్ కల్యాణ్ కు డేట్లు సర్దుబాటు చేయడం కుదరలేదు. దర్శకుడు సుకుమార్ కూడా ఎంతో ప్రయత్నించారు. అయితే ఈ కథను వేరే హీరోతో చేయడానికి ఆయన మొగ్గుచూపలేదు. ఎందుకంటే ఆ కథ పవన్ కల్యాణ్ కు మాత్రం సరిపోతుంది. మరే ఇతర హీరోకు సరిపోదు. దీంతో ఆ కథను సుకుమార్ పక్కన పడేశారు. ఆ విధంగా వారిద్దరి కాంబోలో రావాల్సిన బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అయింది.

కాల్షీట్లు కేటాయించడం చాలా కష్టం
ప్రస్తుతం కూడా అదే కథతో సినిమా చేయాలనే ఉద్దేశంతో సుకుమార్ ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అన్నిరోజుల కాల్షీట్లు కేటాయించడం అనేది కష్టతరంగా ఉంటుంది. ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేయడానికే వీలుకావడంలేదు. దీంతో దర్శకుడు క్రిష్ హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్నారు. మిగిలిన సన్నివేశాలను ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం చేస్తున్నారు. మార్చిలోకానీ, మేలోకానీ ఇది విడుదలవుతుంది. ఓజీని సెప్టెంబరులోకానీ, విజయదశమికి కానీ విడుదల చేసే యోచనలో ఉన్నారు. మిస్టర్ బచన్ సినిమా పోవడంతో హరీష్ శంకర్ తో సినిమా చేయడం కష్టమే అవుతుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సినిమాల నుంచి విరమించుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications