ఇండస్ట్రీలో ఆడపిల్లకు అన్యాయం జరిగితే పవన్ కల్యాణ్ స్పందించరా..?
హీరో రాజ్ తరుణ్ -లావణ్య వివాదం తెలిసిన విషయమే.రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని ..తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాకిచ్చింది. మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు. నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్‌తో ఉన్న మాట వాస్తవమేనని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు నాకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు.
ఇదే సమయంలో లావణ్య మరోసారి మీడియా ముందుకొచ్చి రాజ్ తరుణ్‌పై ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ బ్యూటీ అరియానాతో రాజ్ తరుణ్ ఎఫైర్ నడిపాడాని ఆరోపించింది. వీరిద్దరు కాల్ చేసుకుని మాట్లాడుకునేవారని , ఈ విషయం నటుడు రాజా రవీంద్రకు కూడా తెలుసునని ఆమె చెప్పుకొచ్చింది. తనకు న్యాయం కావాలని అవసరం అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు తెలియజేస్తానని లావణ్య తెలిపింది.

అందుకే న్యాయం కోసం నేను ఆయన వద్దకే వెళ్తానని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ -లావణ్య వివాదం ఇండస్ట్రీలో పెద్ద వివాదంగా మారింది. కేసు మాఫీ కోసం రూ.5 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇది మరింత ముదిరేలా కనిపిస్తోంది. అయితే ఈ ఘటనపై పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు స్పందించకపోవడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన కేవలం హీరోగా ఉండి ఉంటే స్పందించకపోయిన ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు.
పవన్ ప్రస్తుతం ఏపీకి డిప్యూటీ సీఎం. తాను ఉంటున్న ఇండస్ట్రీలో ఓ యువతి బయటకు వచ్చి..తనను ఓ హీరో మోసం చేశాడంటూ తనకు జరిగిన అన్యాయం గురించి రోడ్డెక్కి మరీ ఆందోళన చేస్తోన్నప్పటికి , ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం నిజం దారుణమనే మాటలు వినిపిస్తున్నాయి. టిక్కెట్ల రేట్లు తక్కువుగా ఉన్నాయని, ప్రభుత్వాలను ప్రశ్నించే వారంతా , దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ సైతం ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన ఇప్పటికైనా స్పందించి లావణ్యకు న్యాయం జరిగేలా చూడాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications