'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో..?

ఈ ఏడాది సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాల ఊసే లేదు. దాదాపు మూడు నెలలుగా పెద్ద హీరో సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. డబ్బింగ్ సినిమాలు, రీ-రిలీజ్ సినిమాలతోనే నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.


పెద్ది సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో ప్రొమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఇటీవల మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో పెద్ది కా ఆవాజ్ అనే పేరుతో భారీ ఈవెంట్ ను నిర్వహించారు. ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సెర్ట్ ఈ ఈవెంట్ కు హూజ్ ప్లస్ పాయింట్.. ఈ కార్యక్రమం హ్యూజ్ సక్సెస్ అయింది. అంతకుముందు ముంబైలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ కార్యక్రమానికి కూడా విశేష స్పందన వచ్చింది.

ఇక జూన్ 1 వ తేదీన విజయవాడలో గ్రాండ్ గా ప్రీ- రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుంది చిత్ర యూనిట్. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున మెగా ఫ్యాన్స్ తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

PawanKalyan Reported to Attend the Peddi Pre-Release Event as the Chief Guest Sparking Huge Buzz

అయితే ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ ఎవరనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ మూవీకి చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ వీలును బట్టే విజయవాడలో ప్రీ- రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే ఒకే వేదికపై పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+