పవన్ కల్యాణ్ కు రూ.80కోట్ల ఫైన్?
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలు చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కల్యాణ్ ను చూసి అభిమానులు అయ్యో.. మా హీరో బాగా కష్టపడుతున్నాడే అనే సానుభూతిని చూపిస్తున్నారు. గత అక్టోబరు నెల నుంచి సినిమాల షూటింగ్ కు విరామం ఇచ్చారు. పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకే పరిమితమయ్యారు.
దీనివల్ల అప్పటివరకు షూటింగ్ లో ఉన్న 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ', 'హరి హర వీరమల్లు' చిత్రాలు ఆగిపోయాయి. ఈ మూడింటిలో కూడా పవన్ కళ్యాణ్ తన ఫోకస్ ను పూర్తి స్థాయిలో 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ' పైనే పెట్టాడు. వకీల్ సాబ్ సినిమా సమయం లో ప్రారంభించిన 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని అసలు పట్టించుకోవడం లేదు. దీనిపై డైరెక్టర్ క్రిష్ తోపాటు నిర్మాత ఏఎం రత్నం తీవ్ర నిరాశలో ఉన్నారు.

నిర్మాత రత్నం, దర్శకుడు క్రిష్ కలిసి ఈ సినిమా షెడ్యూల్స్ పై పవన్ తో చర్చించడానికి అనేకసార్లు ప్రయత్నం చేసినప్పటికీ పవన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని తెలుస్తోంది. దీనిపై ఏఎం రత్నం తీవ్ర అసహనంతో ఉన్నట్ల ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఫైనాన్షియర్స్ నుండి 80 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసి 'హరి హర వీరమల్లు' షూటింగ్ ని 60 శాతం పూర్తిచేశామని, ఇప్పుడు చడీచప్పుడు లేకుండా రాజకీయాలు చేసుకుంటే తమ పరిస్థితి ఏమిటని రత్నం తన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షెడ్యూల్స్, డేట్స్ కు సంబంధించి పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ సినిమాను పూర్తిస్థాయిలో ఆపేయాల్సి వస్తుంది. అదే జరిగితే నిర్మాతకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఏప్రిల్ లోపు ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ చేయకపోతే పెట్టిన రూ.80కోట్ల పెట్టుబడిని వడ్డీతో సహా కట్టాలని పవన్ ను రత్నం డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవలే బాబీడియోల్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తాను ఒప్పుకున్న ఒక తెలుగు సినిమా ఆగిపోయిందని ప్రకటించారు. బాబీడియోల్ ఒప్పుకున్న సినిమా హరిహర వీరమల్లు కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications