"ఉరేసుకుంటానని" ఫ్యాన్ లేఖ.. "పెద్ది" చిత్రబృందానికి బిగ్ షాక్ !!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చరణ్ ఫుల్ గా జుట్టు, గడ్డంతో రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. చెర్రీ కొట్టే ఐకానిక్ క్రికెట్ షాక్ కూడా ఫుల్ ట్రెండింగ్ అయ్యింది. అలానే చరణ్(Ramcharan) పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి పహిల్వాన్ గ్లింప్స్ (pehelwan glimpse )అంటూ ఒక వీడియోని విడుదల చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది. అయితే రిలీజ్ తేదీ దగ్గరపడుతున్నా ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అభిమానుల్లో అసహనం పెరుగుతోంది.

వైరల్‌గా మారిన అభిమాని లేఖ..
కాగా జూన్ 4న సినిమా విడుదల కానుండగా, ఇంకా ప్రమోషన్ షెడ్యూల్ ప్రకటించకపోవడంపై ఓ మెగా అభిమాని సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. "గేమ్ ఛేంజర్ సమయంలో కూడా ఇదే టెన్షన్ అనుభవించాం. ఇప్పుడు 'పెద్ది' విషయంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. వెంటనే ప్రమోషన్లు మొదలు పెట్టకపోతే నేను ఉరేసుకుంటా" అంటూ ఒక ఎమోషనల్ లేఖను Xలో పోస్ట్ చేశాడు. దాంతో అభిమాని పోస్ట్ చేసిన ఈ 'సూసైడ్ నోట్' తరహా లేఖ క్షణాల్లో వైరల్‌గా మారింది.
అయితే మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆ పోస్టుపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు "ఇది కేవలం భావోద్వేగం మాత్రమే" అంటుండగా, మరికొందరు "సినిమాల కోసం ఇంత ఎక్స్‌ట్రీమ్‌గా ఆలోచించొద్దు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, 'పెద్ది' టీమ్ సాధారణ ప్రమోషన్లకు బదులుగా భారీ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉండటంతో, మాజీ భారత కెప్టెన్ Mahendra Singh Dhoniను ముఖ్య అతిథిగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. రాంచీలో భారీ ఈవెంట్ నిర్వహించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ధోనీ ఈ ఈవెంట్‌కు హాజరైతే మాత్రం, నార్త్ ఇండియా మార్కెట్‌లో 'పెద్ది' సినిమాకు తిరుగులేని ప్రచారం లభిస్తుందని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications