ప్లీజ్ అలా చేయొద్దు.. స్టేజీపైనే రిక్వెస్ట్ చేసిన సింగర్ శ్రేయా ఘోషల్..
ఓ సీనియర్ సింగర్ స్టేజీపైన తన స్వరాన్ని వినిపిస్తే ఆ క్షణం ఏదో తెలియని అనుభూతి పొందుతాం. మనసారా చప్పట్లు కొట్టి మన ఆనందాన్ని బిగ్గరగా వినిపిస్తాం. కానీ, పశ్చిమబెంగాల్‌లో ఇందుకు విరుద్ధంగా ఆ స్టేజ్ షో జరిగింది. సింగర్ గొంతు నుంచి వచ్చిన పాటలో ప్రతి పదం శ్రోతలకు కన్నీరు తెప్పించింది. అదే సందర్భంలో ఆ సింగర్ ఆ పాటకు దయచేసి చప్పట్లు కొట్టొద్దని రిక్వెస్ట్ చేసింది. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
కోల్‌కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఉదంతం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఆ ఆగ్రహ జ్వాలలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. అక్కడి యువత వినిపించిన నిరసన గళం ప్రతి ఒక్కరినీ స్పందించేలా చేసింది. తాజాగా, ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ఈ హత్యాచార ఘటనకు సంబంధించి ఓ పాటను పాడింది. నిజానికి, ఈ ఈవెంట్ గతంలోనే జరగాల్సి ఉండగా, అక్కడ ఉదృక్త పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసుకున్నారు.

వారి ఆవేదనను..
తాజాగా, ఆల్ హార్ట్స్ టూర్‌లో భాగంగా కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈవెంట్‌లో సింగర్ శ్రేయా ఘోషల్ ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై పాడిన ఎమోషనల్ సాంగ్ అక్కడివారి మనసును కట్టిపడేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. "గాయపడిన నా శరీరం బాధను ఈ రోజు మీరు వింటున్నారు" అంటూ సాగే ఈ పాటతో ఇలాంటి ఘటనల్లో బాధితులు ఎదుర్కొనే బాధ, వారి ఆవేదనను కళ్లకు కట్టినట్లు వ్యక్తీకరించింది.
Hear a Tigress roar at her recent #ShreyaGhoshalLiveInKolkata for the times we are going through! 🙏 pic.twitter.com/UMJXicdlCf
— Shreya Ghoshal (Fan) #SGTribe 🇮🇳 (@shreyaghoshalf4) October 19, 2024
అంతేకాదు, ఏ కళాకారులైన తమ ప్రతిభకు చప్పట్ల రూపంలో అభినందించాలని కోరుకుంటారు. కానీ, ఇక్కడ మాత్రం శ్రేయాఘోషల్ ఈ పాటకు ఎవరూ చప్పట్లు కొట్టొద్దని ప్రేక్షకులను కోరింది. దీంతో అక్కడున్న శ్రోతలు వీ వాంట్ జస్టిస్ నినాదంతో స్టేడియాన్ని హోరెత్తించారు. శ్రేయా ఘోషల్ రిక్వెస్ట్‌కు అక్కడ శ్రోతలు స్పందించిన తీరుకు సోషల్‌మీడియా వేదికగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక సీనియర్ సింగర్‌గానే కాకుండా మనలో ఒకరిలా ప్రవర్తించిన ఆమె తీరుకు హ్యాట్సాప్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications