జాక్ పాట్ కు అడుగు దూరంలో టీమిండియా స్టార్- ఇంకొక్క మంచి ఇన్నింగ్ ఆడితే చాలు

ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోసం పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. టీమిండియా కెప్టెన్, స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకుకు చాలా చేరువ అయ్యాడు. ప్రస్తుతం ఈ ఫార్మాట్ బ్యాటింగ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని కంటే గిల్ 11 రేటింగ్ పాయింట్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాడు. ఇంకొక్క మంచి ఇన్నింగ్ ఆడితే.. ఆ లోటు కాస్తా భర్తీ అవడం గ్యారంటీ.

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను విజేతగా నిలిపాడు. టాప్ ఆర్డర్ వైఫల్యంతో భారత్ కష్టాల్లో పడిన సమయంలో జట్టును ముందుండి నడిపించాడు. 75 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 80 పరుగులు చేశాడు. కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినప్పటికీ జట్టును పట్టాలెక్కించగలిగాడు. ఈ మ్యాచ్ ద్వారా గిల్ అదనంగా 12 రేటింగ్ పాయింట్లు సాధించాడు.

Shubman Gill Closes In On Latest ICC ODI No 1 Rank as Daryl Mitchell Lead Cut To 11 Points with 80

అటు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో డారిల్ మిఛెల్ కూడా కూడా రాణిస్తోండటంతో నంబర్ వన్ స్థానం కోసం వీరిద్దరి మధ్య ఓ పెద్ద ప్రచ్ఛన్న యుద్ధమే సాగుతోన్నట్టనిపిస్తోంది. మొత్తంగా మిఛెల్ 814 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 803తో శుభ్ మన్ గిల్ రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 3, 4 స్థానాల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు. విరాట్ కోహ్లీ వద్ద ఉన్న పాయింట్ల సంఖ్య.. 757. అతనికి అతి సమీపంలో ఉన్నాడు రోహిత్ శర్మ. అతని ఖాతాలో ఉన్న పాయింట్లు 744.

ఫిఫా సెమీస్ లో కొదమసింహాల పోరు- ఫ్రాన్స్ కు క్లినికల్ షాట్: ఎంబాప్పె కంట తడి: ఫైనల్ లో..!!
ఫిఫా సెమీస్ లో కొదమసింహాల పోరు- ఫ్రాన్స్ కు క్లినికల్ షాట్: ఎంబాప్పె కంట తడి: ఫైనల్ లో..!!

712 పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జడ్రాన్ అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు. బాబర్ ఆజమ్- 689, ఐర్లాండ్ కు చెందిన హ్యారీ టెక్టార్- 679, శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక- 659, ఆ దేశానికే చెందిన కుశాల్ మెండీస్- 648తో తొలి అయిదు స్థానాలో నిలిచారు. ఇంగ్లాండ్ పై మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదుర్స్ అనిపించిన అక్షర్ పటేల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అద్భుతమైన పోరగతిని సాధించాడు. బ్యాటింగ్‌లో 52 బంతుల్లో కీలకమైన 57 పరుగులతో రాణించడమే కాకుండా, బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టి విజయానికి బలమైన పునాది వేశాడు.

ఈ ప్రదర్శనతో అతడు వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-10లోకి ప్రవేశించి 9వ స్థానంలో నిలిచాడు. అదే మ్యాచ్‌లో అజేయ అర్ధ సెంచరీతో మెరిసిన వాషింగ్టన్ సుందర్ వన్డే బ్యాటింగ్ విభాగంలో 24 స్థానాలు ఎగబాకి 177వ ర్యాంకుకు చేరుకున్నాడు. దాంతో పాటు ఆల్‌రౌండర్ల విభాగంలో 16 స్థానాలు మెరుగుపరుచుకుని 55వ స్థానానికి వచ్చాడు. సుదీర్ఘ విరామం తరువాత వన్డే జట్టులోకి పునరాగమనం చేసిన టీమిండియా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా సైతం అత్యంత పొదుపైన బౌలింగ్ ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తిరిగి 24వ స్థానానికి చేరుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+