సమంత వల్ల నక్కతోక తొక్కిన పూజా హెగ్డే!
అన్ని భాషల్లో హీరోయిన్ గా పూజా హెగ్డే స్టార్ డం సంపాదించుకుంది. మహేష్ బాబు సరసన గుంటూరు కారం, పవన్ కల్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు డేట్లు ఖాళీ లేకపోవడంతో ఈ రెండు సినిమాల నుంచి తప్పుకుంది. ఆ తర్వాత పూజా ఒక్క తెలుగు సినిమాకు కూడా సైన్ చేయలేదు. అయితే నిర్మాత, దర్శకుల నుంచి ఆమెకు ఎటువంటి ఆఫర్లు లేవని ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతుంది.
నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం అనే సినిమాలో కూడా పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నప్పటికీ ప్రియాంక మోహన్ ఫైనల్ అయింది.ఇప్పుడు సమంత కారణంగా పూజ హెగ్డే కి ఒక తెలుగు సినిమా వచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఒక సినిమా తీయబోతున్నట్లు ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. నందినీరెడ్డికి సమంత మంచి స్నేహితురాలు కావడంతో ఆమె హీరోయిన్ గా నటించబోతోందన్నారు. అయితే సమంత రెస్ట్ మోడ్ లో నుంచి ఇంకా బయటకు రాని నేపథ్యంలో తాను సినిమా చేయలేనని తన స్నేహితురాలు నందిని రెడ్డికి తేల్చి చెప్పిందట.

సమంతకు బుదులుగా ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని నందినిరెడ్డి ఆలోచిస్తున్న సమయంలో పూజా హెగ్డే అయితే కరెక్ట్ గా ఉంటుందని సినిమా యూనిట్ భావించడంతో చివరికి ఆమెను సంప్రదించారు. ఆమెకూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అది త్వరలోనే పట్టాలెక్కబోతోంది.
ప్రస్తుతం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సరసన పూజా హెగ్డే ఒక సినిమా చేస్తోంది. తెలుగులో అయితే ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అధికారికంగా ఫైనలవలేదు. తాజాగా నందినిరెడ్డి చిత్రం ఓకే అయినట్లు తెలుస్తోంది. వరుసగా ఫ్లాప్స్ పలకరిస్తుండటంతో నిర్మాతలు పూజాకు ముఖం చాటేశారనే వార్తలు వస్తున్నప్పటికీ సమంత వల్ల ఒక సినిమా అవకాశం రావడంతో అక్కడి నుంచి తిరిగి మళ్లీ స్టార్ డం సాధిస్తుందని పూజా అభిమానులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications