ఒకే చోట రాజమౌళి, కేజీఎఫ్ హీరో యష్, హిందూ సాంప్రధాయం, ఆ నిర్మాతతో ప్లాన్ చేస్తున్నారా!

ఒకే రోజు ఒకేచోట జరిగిన కార్యక్రమంలో పాన్ ఇండియా హీరో, రాకింగ్ స్టార్ స్టార్ యష్, పాన్ ఇండియా డైరెక్టర్ జక్కన్న రాజమౌళి పాల్గొన్నారు. ఈ ఇద్దరూ ప్రముఖులు భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రెండు వేర్వేరు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. యష్ తదుపరి చిత్రం టాక్సిక్ సినిమా పనులతో చాలా బిజీగా ఉన్నాడు. ఇక బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన ఎస్.ఎస్.రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

రాజమౌళి, హీరో యష్ వారివారి పనులకు విరామం ఇచ్చి కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని బళ్లారికి ప్రయాణించారు. బళ్లారిలోని శ్రీ అమృతేశ్వరాలయ ప్రారంభోత్సవంలో రాజమౌళి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇదే సమయంలో ఇదే ఆలయం ప్రారంభోత్సవానికి రాకింగ్ స్టార్ యష్ కూడా హాజరైనాడు. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి ఆయన సతీమణి రమా రాజమౌళితో వచ్చి శ్రీ అమృతేశ్వరాలయ ప్రతిష్ఠను వీక్షించారు.

Popular director SS Rajamouli and KGF hero Yash attended the inauguration of the temple in Bellary

ఈ సమయంలో రాజమౌళి, హీరో యష్ ను చూసేందుకు బళ్లారి వాసులు ఉవ్విళ్లూరారు. ముఖ్యంగా రాకింగ్ స్టార్ యష్‌ని చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. ఈ సమయంలో అభిమానులను ఉద్దేశించి యష్ మాట్లాడుతూ ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా శ్రీ అమృతేశ్వరాలయానికి ఎందుకు వచ్చానో అనే విషయం వివరించారు. నేను దేవుడి దర్శనం కోసం ఇక్కడికి వచ్చానని, ఆ దేవడి ఆశిస్సులు తనకు, తన అభిమానులకు, దేశంలోని ప్రజలు అందరికి ఉండాలని కోరుకున్నానని అన్నారు.

కొర్రపాటి సాయి అంటే నాకు చాలా ఇష్టం. నా సినిమా కేజీఎఫ్ చాప్టర్ 1ని టాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూట్ చేసింది ఆయనే అని, కేజీఎఫ్ 1 సినిమాను తెలుగులో అంత హిట్ కావడానికి ఆయనే కారణం అని హీరో యష్ చెప్పారు. కేజీఎఫ్ సినిమా తెలుగులో అంత పెద్ద హిట్ కావడానికి సాయి కొర్రపాటి ప్రధాన కారణం అని, అంతే కాకుండా ఆయనకు దైవ భక్తి ఎక్కువ అని, ఆయన దేవుడి భక్తుడని, అందుకే మొదటగా ఆయన ఊరిలో గుడి కట్టడం గురించి తనకు ముందే చెప్పారని హీరో యష్ అన్నారు.

Popular director SS Rajamouli and KGF hero Yash attended the inauguration of the temple in Bellary

ఈ కారణంగా ఇక్కడికి వచ్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, దేవుడి పూజలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉందని హీరో యష్ అన్నారు. మరోవైపు, ఎస్ఎస్ రాజమౌళి కూడా ఆయన భార్య రమాతో కలిసి గుడి ప్రారంభోత్సవానికి వచ్చారు. బళ్లారిలోని శ్రీ అమృతేశ్వరాలయ ప్రారంభోత్సవానికి ఇద్దరు పాన్ ఇండియా ప్రముఖులు రావడంతో బళ్లారి వాసులు పులకించిపోయారు. హీరో యశ్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి బళ్లారి రాకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తెల్లటి ధోతీ, శల్య దుస్తులు ధరించారు. అదేవిధంగా, అతని భార్య రమా రాజమౌళి కూడా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. హీరో యష్ కూడా సెమీ ట్రెడిషనల్ లుక్ కుర్తా పైజామాలో ఆలయంలోకి ప్రవేశించారు. ఇదిలా ఉంటే ఈ ఆలయాన్ని వారాహి చలన చిత్ర ప్రొడక్షన్స్ కు చెందిన సాయి కొర్రపాటి నిర్మించారు. ఇక వీరిద్దరి విషయానికి వస్తే.. రాజమౌళి టైటిల్ పెట్టని మహేష్ బాబు సినిమాకు దర్శకత్వం వహిస్తుంటే కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న టాక్సిక్ సినిమాలో హీరో యష్ నటిస్తున్నాడు. రాజమౌళి, యష్ ల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+