ఏదో అనుకున్నాం కానీ ..మంచు విష్ణు కంటతడి పెట్టించాడు భయ్యా..!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన 'కన్నప్ప' నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ప్రభాస్ రుద్రుడి పాత్రలో నటిస్తున్నాడని వార్తలు రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్షయ్ కుమార్ శివుడిగా, మోహన్‌లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రలలో నటించారు.
ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ రివ్యూలు
'కన్నప్ప'కు ప్రీమియర్స్ నుంచే మంచి రివ్యూలు వస్తున్నాయి. తమిళ నటుడు శరత్ కుమార్ నాథనాధుడిగా తన పాత్రలో మెప్పించారు. ఇక మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో మహాదేవ శాస్త్రిగా అద్భుతమైన నటనను కనబరిచారు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ కూడా చక్కగా నటించింది.

ప్రభాస్, విష్ణు నటనకు ప్రశంసలు
సినిమాకు ప్రధాన ఆకర్షణగా రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. కీలకమైన 40 నిమిషాల ఎపిసోడ్‌లో ప్రభాస్ డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, ప్రభాస్ చెప్పిన "పెళ్లి" డైలాగ్‌కు థియేటర్లలో నవ్వులు పూశాయి. క్లైమాక్స్‌లో శివుడికి తన కన్ను దానం చేసే సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఈ సన్నివేశంలో మంచు విష్ణు నటన ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది.
పాటలు, నేపథ్య సంగీతం కూడా మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయని, వీఎఫ్‌ఎక్స్ పర్వాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా, 'కన్నప్ప' ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేయడం ఖాయం అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications