ఆ సినిమా నచ్చలేదని రాజమౌళి ముఖంమీదే చెప్పిన ప్రభాస్, రామ్‌చరణ్

దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తోందంటే మొన్నటివరకు భారతీయులు మాత్రమే ఎదురుచూసేవారు. కానీ ఆర్ఆర్ఆర్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా దాదాపు మూడు సంవత్సరాల నుంచి టాప్-10లో ట్రెండింగ్ లో నిలుస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాకు ఎంత ఆదరణ దక్కుతుందో తెలుస్తోంది. అటువంటి రాజమౌళి ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు కాగా, మహేష్ బాబుతో తీయబోతున్న పాన్ వరల్డ్ మూవీ మరో ఎత్తు. ఈ సినిమాను రూ.1500 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ సినిమాలకు మించి తీయబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులతోపాటు దిగ్గజ దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

డార్లింగ్ కు ఆ పాయింట్ నచ్చలేదు
రాజమౌళి తన కెరీర్ ప్రారంభంలో ఈటీవీలో శాంతి నివాసం సీరియల్ చేశారు. తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దీనికి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ సినిమాలో హీరో జైలులో ఉండి తన తండ్రి కోరిక మేరకు న్యాయ విద్యను పూర్తిచేస్తాడు. ఈ సినిమాను ముందుగా ప్రభాస్ తో చేద్దామనుకొని అడగ్గా ఈ పాయింట్ డార్లింగ్ కు నచ్చలేదు. దీంతో సినిమా చేయనని చెప్పడంతో తారక్ తో చేయగా సినిమా సూపర్ హిట్ అయింది. రాజమౌళికి మంచిపేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తారక్ తోనే సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు.

Prabhas and Ram Charan told Rajamouli to his face that they didn t like the movie

తనకు కథ నచ్చలేదని చెప్పాడు
తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ సందర్భంలో తనకు స్టూడెంట్ నెంబర్ వన్ కథ నచ్చలేదని రాజమౌళికి చెప్పారు. ఇలా ఇద్దరు హీరోలకు ఈ సినిమా నచ్చలేదని నేరుగా చెప్పేశారు. దాన్ని రాజమౌళి చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలుగా మారిన వీరిద్దరితో ఛత్రపతి, బాహుబలి, బాహుబలి2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలను తీశారు. రాజమౌళి నుంచి సినిమా వస్తోందంటూ ప్రపంచం మొత్తం ఎదురుచూసే తరుణంలో గతంలో అతను చేసిన సినిమా నచ్చలేదని ఇద్దరు స్టార్ హీరోలు చెప్పడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+