ప్రభాస్ 'ఫౌజీ' లెటర్ బాక్స్ రివ్యూ వైరల్.. బాహుబలి రికార్డులు బద్దలే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌..'సీతారామం' డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్​ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ 'ఫౌజీ'. ఈ మూవీకోసం భారత్ నుంచే కాకుండా ప్రపంచ దేశాల సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీ డిసెంబర్ 3న థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్ చేసినా సినిమా కొంచెం వెనక్కు వెళ్లినట్లు స్పష్టం అవుతోంది. అయితే చిత్ర యూనిట్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ ఇటీవల ప్యారడెైజ్ మూవీ ప్రీ- రిలీజ్ ఫంక్షన్ లో ఈ చిత్ర నిర్మాత వై.రవిశంకర్‌ మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఫౌజీ మూవీ కొంచెం వెనక్కి వెళ్తోందని.. ఇది వేరే లెవెల్‌ సినిమా. ప్రభాస్‌ ను 'బాహుబలి' తర్వాత మళ్లీ అంత గొప్పగా చూపించే చిత్రమిదేనని.. కచ్చితంగా ప్రేక్షకులకు జీవితాంతం గుర్తుండిపోతుందని స్పష్టం చేశారు. దాంతో ఫౌజీ మూవీ వాయిదా దాదాపు ఖరారైనట్లుగా భావించవచ్చు.

ఇక ఫౌజీ మూవీ జనవరిలో వచ్చే అవకాశాలు ఉన్నా జనవరిలో ఇప్పటికే అరడజను సినిమాలకు పైగా ఉన్నాయి. అయితే దేశభక్తి తరహా సినిమా కావడంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే ఫైనల్ గా రిలీజ్ డేట్ పై మేకర్స్ ఏం ప్లాన్ చేస్తారో చూడాల్సి ఉంది. అయితే తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రభాస్ ఫౌజీ లెటర్ బాక్స్ రివ్యూ అంటూ ఒక పోస్టు తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీ ఎలా ఉండబోతుందన్న అంశంపై ఫౌజీ చిత్రం కోసం పనిచేసే ఓ యువకుడు వెల్లడించడం విశేషం. ఆయన మాటల ప్రకారం..

prabhas Fauji movie Letterbox review goes viral online Baahubali records set to be shattered

" ప్రస్తుతం నేను ఈ మూవీలో పనిచేస్తున్నాను. ప్రభాస్ సెట్ లో ఉన్న ప్రతిరోజూ నేనూ ఉన్నాను. చెప్తున్న రాసిపెట్టుకోండి బ్లాక్ బస్టర్ అంతే.. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ మీరు ఇమేజిన్ కూడా చేసుకోలేరు. ఓపెన్ సీక్వెన్స్ ఇట్ సెల్ఫ్ ఏ టికెట్ వర్తీ.. నరసింహ స్వామి ఫైట్ మరో కాటేరమ్మ ఫైట్ గా మారబోతుంది. ప్రభాస్ మెంటల్ ఎక్కించాడు. క్లైమాక్స్ అద్భుతం. ఇమాన్వి- ప్రభాస్ ల కెమిస్ట్రీ బాగా వచ్చింది. ఇమాన్వి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటారు ఎక్కువగా.. రీసెంట్ ఇయర్స్ లో వచ్చిన అన్ని హీరోయిన్ క్యారెక్టర్స్ లో ది బెస్ట్ అవుతుంది. హను రాఘవపూడి ఈజ్ మై కెప్టెన్. మీరంతా ఓ మార్వెలస్.. మైండ్ బ్లోయింగ్..స్టోరీ టెల్లింగ్ ను చూడబోతున్నారు. ప్రభాస్ ట్రాన్స్ ఫార్మేషన్ ఆచారీ నుంచి అర్జున వరకు.. థియేటర్లలో ఈ మూవీని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని రివ్యూ ఇచ్చాడు. దాంతో ఈ మూవీ రివ్యూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+