TGSPC పరీక్షల షెడ్యూల్ విడుదల - CBT విధానంలో..!!
నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ అందించింది. TGSPC రిక్రూట్ మెంట్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ విధానంలో జరుగుతాయని వెల్లడించింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఆధారంగా రిక్రూట్‌మెంట్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత టెస్ట్ విధానం లోనే జరుగుతాయని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉద్యోగాల సిద్దం అవుతున్న నిరుద్యోగ అభ్యర్ధులకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఆధారంగా రిక్రూట్‌మెంట్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (CBT) విధానంలోనే జరుగుతాయని కమిషన్ వెల్లడించింది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి అక్టోబర్ 24, 2026న సీబీటీ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. అదే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోనే అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులకు అక్టోబర్ 26, 2026న పరీక్ష జరగనుంది.

కాగా, రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (సివిల్) పోస్టులకు నవంబర్ 06 మరియు నవంబర్ 07, 2026 తేదీల్లో రెండు రోజుల పాటు సీబీటీ పరీక్షలు నిర్వహిస్తారు. వీటితో పాటుగా పాఠశాల విద్యాశాఖలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (DEO) మరియు గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I పోస్టులకు నవంబర్ 12, 13 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. సీబీటీ విధానంలోనే పరీక్షలు జరగనుండటంతో అభ్యర్ధులు అందుకు అనుగుణంగా సమాయత్తం కావాలని కమిషన్ సూచిస్తోంది. ఇక.. ఇందుకు సంబంధించి హాక్ టికెట్లు, పరీక్షా కేంద్రాల సమాచారాన్ని త్వరలోనే టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.














Click it and Unblock the Notifications
