హైదరాబాద్ కు దగ్గరలోనే పల్లెటూరి అనుభూతి.. ఒక్కసారైనా వెళ్లి తీరాల్సిందే..

హైదరాబాద్ విశ్వ నగరంగా మారుతోంది. ఎటు చూసినా పెద్ద పెద్ద భవనాలు.. రద్దీ రోడ్లు.. ట్రాఫిక్ జామ్ లు, రణగొణధ్వనులతో అలసిపోతుంటారు. ఇక వీకెండ్ వచ్చిందంటే సినిమాలు.. పబ్ లు.. మాల్స్, రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతుంటారు. కానీ హైదరాబాద్ నగరానికి కాస్త దూరంగా ఓ అందమైన పల్లెటూరి అందాలను మరిపించే విలేజ్ రిసార్ట్ ఉందన్న సంగతి మీకు తెలుసా..? ఇక్కడకు వెళ్తే గోదావరి జిల్లాల్లోని గ్రామాలకు వెళ్లామా..? అన్న అనుభూతి కలుగుతుంది. చుట్టూ ఎటు చూసినా పచ్చని పల్లెటూరి వాతావరణం.. సంప్రదాయ ఆటలు, ఫామ్ యానిమల్స్‌ తో అస్సలు టైమే తెలియదు.. ఇక్కడకు వెళ్తే త్వరగా తిరిగి రావాలని అనిపించదు. చిన్ననాటి ఆటలను మళ్లీ ఆడుకోవచ్చు. ఇక్కడ 50 కు పైగా పండ్ల చెట్లు ఉంటాయి. ఫిషింగ్ పాండ్ కూడా ఉంది. అక్కడ సరదాగా చేపలు పడుతూ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఫిషింగ్ పాండ్ దగ్గర ప్రశాంతంగా కొంత సమయం గడపొచ్చు. అలాగే ఇక్కడ రాత్రి పూట బస చేసే అవకాశం కూడా ఉంది.

హైదరాబాద్ కు కేవలం 50 కి. మీ. దూరంలోనే ఉంది. ఈ కుముదాపురం ఎథ్నిక్ విలేజ్ రిసార్ట్. సిటీ లైఫ్ కు దూరంగా కొంత విరామం తీసుకుని కుటుంబంతో, భాగస్వామితో, స్నేహితులతో సరదాగా సమయం గడిపేందుకు ఈ విలేజ్ రిసార్ట్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కుముదాపురం విలేజ్ ఎథ్నిక్ రిసార్ట్ కు వెళ్తే చిన్నప్పుడు ఆడిన ఆటలను మళ్లీ ఆడుకోవడంతో పాటు.. ఇప్పటి జనరేషన్ పిల్లలకు పల్లెటూరి వాతావరణాన్ని చూపించడం, ఫామ్ లో పశువులు, జంతువులను చూడటం, పచ్చని పొలాల్లో సమయం గడపడం వంటి అనుభవాలు ఇక్కడ లభిస్తాయి.

అలాగే ఈ విలేజ్ లో రోజంతా గడిపి ఇక్కడే రిసార్ట్ లో ఉన్న ఇన్‌ హౌస్ రెస్టారెంట్ లో భోజనం చేయొచ్చు. ఇక్కడ సౌత్ ఇండియన్ వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే పెంపుడు జంతువులను ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్తుంటారు. అలాంటి వారి కోసం ఇక్కడ ప్రత్యేకమైన వసతిని ఏర్పాటు చేశారు.

Kumudapuram Ethnic Village Resort located just 50km from Hyd offering feeling of visiting a village

ఈ రిసార్ట్ పెట్ ఫ్రెండ్లీగా ఉన్న నేపథ్యంలో మీ పెట్‌ తో కలిసి ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక కేవలం ఒక్కరోజు వెళ్లి రావాలనుకునేవారికే కాకుండా రాత్రి అక్కడే ఉండాలనుకునేవారికి కూడా వివిధ రకాల వసతి సదుపాయాలు ఉన్నాయి. ఈ కుముదాపురం రిసార్ట్ బూర్గుల ప్రాంతంలోని షాద్ నగర్ లో ఉంది. బెంగళూరు హైవేకు దగ్గరగా ఈ రిసార్ట్ ఉంది. హైదరాబాద్ నుంచి కేవలం 50 కి.మీ. దూరంలోనే ఈ రిసార్ట్ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+