'సలార్' హిట్ అయితే గుండు కొట్టించుకుంటా?
నిజంగా ప్రభాస్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్ ఇది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సలార్ ఫీవరే పట్టుకుంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ థియేటర్స్ లో ఓ బిగ్ బ్లాక్ బస్టర్ అందుకోవడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నాడంటున్నారు. ఆరడుగుల అందగాడు ప్రభాస్ ఎంతో ఇష్టంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా కావడంతోపాటు మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్, కేజిఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.
ఈ సినిమాకి సంబంధించిన ఒక్కొక్క న్యూస్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. థియేటర్స్ వద్ద ప్రభాస్ అభిమానుల సందడి నెలకొంది . ఇప్పటినుంచే థియేటర్ వద్ద ఎంత హంగామా చేయాలి అంటూ పక్క ప్లాన్ తో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రణాళికలు రచించుకుంటున్నారు. ప్రభాస్ అభిమానులకు కొందరు హీరోలు ఉచితంగా టికెట్లను బుక్ చేసి ఇస్తున్నారు.

డార్లింగ్ ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ అయిన గోపీచంద్ ఏకంగా సినిమా హిట్ కావాలంటూ భారీ స్థాయిలోనే మొక్కేశాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. ప్రభాస్ ఈ సినిమాతో హిట్ కొడితే తిరుమల శ్రీవారికి నడుచుకుంటూ వెళ్లి గుండు కొట్టించుకుంటాను అంటూ గోపీచంద్ మొక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ తెలుగు సినీ పరిశ్రమలో వైరల్ అవుతుంది. ఎవరు చెప్పారు ..? ఎక్కడ నుంచి లీక్ అయ్యిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ హాట్ గా మారిపోయింది. ప్రస్తుతం ఇదే ట్రెండ్ అవుతోంది. నిజంగానే గోపీచంద్ ఆ మాట అన్నారా? లేదంటే ప్రభాస్ అభిమానులు ఎవరైనా ఈ వార్తను పుట్టించారా? అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications