పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రభాస్..?
ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పోలింగ్‌కు కేవలం 12 రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల తరుఫున అన్ని పార్టీల అధినేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత శనివారం అధికార వైసీపీ తమ మ్యానిఫెస్టోను విడుదల చేయగా, మంగళవారం కూటమి మ్యానిఫెస్టోను చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు విడుదల చేశారు.
ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్.. ఈసారి గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారు. పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కల్యాణ్ విసృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం జబర్థస్త్ నటులు సైతం రంగంలోకి దిగారు. మెగా హీరో వరుణ్ తేజ్, నాగబాబు ఆయన భార్య ప్రచారం నిర్వహిస్తున్నారు.

సీనియర్ నటి ఖుష్బు సైతం పవన్ కల్యాణ్ తరుఫున ప్రచారం నిర్వహించడానికి తాను రెడీగా ఉన్నానని ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తమ్ముడు పవన్ కల్యాణ్‌కు అండగా ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. పవన్ కల్యాణ్‌కు మద్దతుగా హీరో ప్రభాస్ సైతం రంగంలోకి దిగుతున్నారనేది ఈ వార్త సారాంశం. జనసేనకు మద్దతుగా ప్రభాస్ కూడా ప్రచారం నిర్వహించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఈ వార్త ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ప్రభాస్ పవన్ తరుఫున ప్రచారం చేస్తే పిఠాపురంలో తమ నేత గెలుపు ఈజీ అవుతుందని జనసైనికులు భావిస్తున్నారు. అయితే ఇదింతా కేవలం ప్రచారమే అని ప్రభాస్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ప్రభాస్ ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలుపరని..ఆయన ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారని రాజకీయాలకు తమ హీరో దూరమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.












Click it and Unblock the Notifications