అబ్బా ఏమున్నాడ్రా బాబు.. "స్పిరిట్" మూవీ నుంచి ప్రభాస్ ఫోటో లీక్ ?
గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా "రాజాసాబ్" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ప్రస్తుతం డార్లింగ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్న మూవీ 'స్పిరిట్'. పాన్ వరల్డ్ టార్గెట్ గా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ " త్రిప్తి డిమ్రి " హీరోయిన్ గా నటిస్తుంది. అలానే వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం.
కాగా తన ఫిల్మ్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్. ఆయన గత చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి ప్రభాస్ మాస్ అవతార్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని జోరుగా చర్చ నడుస్తోంది. అంతే కాకుండా సీరియస్ కాప్ స్టోరీ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో ఓ రేంజ్ ఎలివేషన్ ఇవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ప్రభాస్ రాబోయే చిత్రాల అప్‌డేట్‌ల కంటే కూడా లీక్ అయిన ఒక ఫోటోలే అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఫౌజీ మూవీలో పిక్ లీక్ అవ్వగా.. ఇప్పుడు లేటెస్ట్ గా స్పిరిట్ మూవీ షూటింగ్ నుంచి లీక్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ గా మారింది. ఈ లీక్ అయిన చిత్రంలో ప్రభాస్ పూర్తిగా మాస్, స్టైలిష్ లుక్‌లో కనిపించడం అభిమానులను అలరిస్తోంది. తెల్లటి పంచెకట్టు, పొడవాటి జుట్టు, కళ్ళజోడు ధరించి, చేతిలో గన్‌తో దర్శనమిచ్చిన ఈ లుక్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ఇది గతంలో ఎన్నడూ చూడని కొత్త అవతారం అని ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు ఈ మూవీలో ప్రభాస్ తండ్రి పాత్ర కోసం మొదట మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఈ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాత, ప్రస్తుతం మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో నిజంగా 'స్పిరిట్' సెట్స్ నుంచి లీక్ అయినదేనా, లేక అభిమానులు సృష్టించినదా అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications